Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabadi Biryani: బిర్యానీ తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..

ఏది ఏమైనా బిర్యానీ అంటే.. బిర్యానీనే.. ఇంత కంటే బెస్ట్ ఏదీ ఉండదంటూ బిర్యానీ ప్రియులు గిన్నెలు కొద్ది లాగించేస్తారు. బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Hyderabadi Biryani: బిర్యానీ తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Hyderabadi Biryani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2023 | 8:50 PM

ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్.. బిర్యానీ ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఇంకా నాన్ వెజ్ తినని వారు.. వెజ్ బిర్యానీని తింటారు. ఏది ఏమైనా బిర్యానీ అంటే.. బిర్యానీనే.. ఇంత కంటే బెస్ట్ ఏదీ ఉండదంటూ బిర్యానీ ప్రియులు గిన్నెలు కొద్ది లాగించేస్తారు. బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లాది మంది ఎంతో ఇష్టంతో తింటారు. రుచిలో కమ్మగా ఉందని తింటారు కానీ.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందని ఎప్పుడూ బిర్యానీ ప్రియులు ఆలోచించరు. అయితే, అలాంటి వారిలో మీరూ ఉంటే.. ఈ వార్త కొంచెం చెదు కలిగిస్తుంది. ఎందుకంటే.. బిర్యానీ కూడా అనారోగ్యానికి గురిచేస్తుందంటూ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా జరిపిన పరిషోధనలో ఈ విషయం వెల్లడైంది. కొన్ని ప్రాంతాల్లో లభించే బిర్యానీ మంచిదేనని.. మరికొన్ని ప్రాంతాల్లో లభించే బిర్యానీ అంత మంచిది కాదంటూ వివరించారు. ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికలో బిర్యానీ గురించి ఈ వివరాలను వెల్లడించారు.

హైదరాబాదీ బిర్యానీ ఆరోగ్యకరం..

హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది చాలా వరకు ఆరోగ్యకరమైనదని పరిశోధనలో వెల్లడించారు. పరిశోధన ప్రకారం.. హైదరాబాద్ బిర్యానీలో బియ్యం, మాంసం, నూనె వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, నెయ్యి, ఇతర కూరగాయలు వాడటం వల్ల ఇది ఆరోగ్యవంతంగా తయారవుతుందని అధ్యయనంలో తేలింది.

ప్రయోజనాలు..

యాంటీ ఆక్సిడెంట్లు: బిర్యానీలో పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కుంకుమపువ్వు కలుపుతారు. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

మెరుగైన జీర్ణక్రియ: బిర్యానీలో పసుపు, నల్ల మిరియాలు కలుపుతారు. ఈ రెండు మసాలాలు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పని చేస్తాయి.

విటమిన్ సమృద్ధిగా ఉండే ఆహారం: ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లితో వంటకం రుచికరంగా తయారవుతుంది. అయితే ఇవి మనల్ని ఆరోగ్యంగా మార్చుతాయి. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి లభిస్తాయి. బిర్యానీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయని వివరించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..