Water Bottle: ప్లాస్టిక్‌ వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే గుండె గుభేల్‌.. ఇకనైనా జాగ్రత్త పడండి..

ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని నీళ్లు తాగడం అనేది సర్వసాధారణమైంది. అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా.. అనవసర పరిస్థితుల్లో కూడా వాటర్ బాటిల్స్‌ను చాలామంది ఉపయోగిస్తున్నారు.

Water Bottle: ప్లాస్టిక్‌ వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే గుండె గుభేల్‌.. ఇకనైనా జాగ్రత్త పడండి..
Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2023 | 3:30 PM

ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని నీళ్లు తాగడం అనేది సర్వసాధారణమైంది. అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా.. అనవసర పరిస్థితుల్లో కూడా వాటర్ బాటిల్స్‌ను చాలామంది ఉపయోగిస్తున్నారు. ఇంకా ప్రయాణం చేసే సందర్భాల్లో అయితే.. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ను తప్పనిసరిగా తీసుకెళ్తుంఆరు. అయితే, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ లేకుండా ప్రయాణం చేయడం సాధ్యమేనా? అనే సందేహం వస్తే.. అది లేకుండా ప్రయాణించడం కొంచెం సవాలుతో కూడుకున్నదే.. అయినప్పటికీ.. మన ఆరోగ్యంపై దృష్టి సారిస్తే.. సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ప్లాస్టిక్ బాటిళ్లను నివారించేందుకు ముఖ్యంగా రోడ్డు పక్కన విక్రయించే ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటికి బదులుగా ఒక చిన్న మెటల్ బాటిల్‌ను మీ వద్ద ఉంచుకుని దాన్ని రీసైకిల్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే.. ప్రజలు ప్లాస్టిక్ బాటిల్స్ లేకుండా ప్రయాణించవచ్చని, రాబోయే ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. ప్లాస్టిక్‌ యూజ్‌ చేయడం వల్ల క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుందని.. గుండె బలహీనం అవ్వడంతోపాటు.. క్యాన్సర్‌ లాంటి వ్యాధులు కూడా సంభవించే అవకాశముందని పేర్కొంటున్నారు.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎందుకు హానికరం..

వాటర్ బాటిళ్లను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం పాలిమర్. పాలిమర్ అంటే కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, క్లోరైడ్‌లతో తయారు చేసేది.. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. చాలా వాటర్ బాటిళ్లలో పాలికార్బోనేట్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. వాటర్ బాటిల్స్ కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉండటమే కాకుండా అందులో Phthalates, Bisaphenol A (BPA) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇవి గుండె సంబంధిత వ్యాధులు లేదా మధుమేహానికి కారణం అవుతాయి.

భవిష్యత్తులో.. అనేక వ్యాధులు

ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల తెలిసి, తెలియక మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోకి వెళ్లి కరిగిపోతున్నాయని మనందరికీ తెలుసు. Frontiers.org నివేదిక ప్రకారం.. వీధుల్లో కనిపించే క్లోజ్డ్ బాటిల్ వాటర్ వేడిగా ఉన్న వస్తువులను తాకిన తర్వాత చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఎండలో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కారణంగా మైక్రోప్లాస్టిక్‌లు నీటిలో కూడా కరిగిపోవడం ప్రారంభిస్తాయి. ఈ నీటిని తాగిన వెంటనే శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే ఎండోక్రైన్ వ్యవస్థను పాడు చేస్తుంది. ఇలాంటి పొరపాటు నిరంతరం చేయడం వల్ల సంతానలేమి, యుక్తవయస్సు ప్రారంభంలోనే హార్మోన్ల అసమతుల్యత, కాలేయం దెబ్బతింటాయి. మైక్రో ప్లాస్టిక్ వల్ల ప్రజలు క్యాన్సర్ సమస్యను సైతం ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ బాటిల్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

చాలా మంది ఆరోగ్య నిపుణులు, ట్రావెల్ బ్లాగర్లు ఫోల్డబుల్ బాటిల్‌ను మీతో ఉంచుకోవాలని.. దానిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చని అంటున్నారు. సంచిలో పెట్టుకోవాలన్నా, చేతిలో పెట్టుకోవాలన్నా.. బాటిల్ భారంగా అనిపించదు. మీరు ఆన్‌లైన్‌లో, స్థానిక దుకాణాలలో ఇటువంటి బాటిళ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ బాటిల్‌ను ఎల్లప్పుడూ మీతోనూ ఉంచుకుంటూ.. మీకు అవకాశం దొరికినప్పుడల్లా నింపండి. ఎందుకంటే దాహం వేసినప్పుడు నీటిని తాగవచ్చు. మీరు రైల్వే బస్సు మెట్రో స్టేషన్, స్థానిక దుకాణం, హోటల్ లేదా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయం మొదలైన వాటిలో నీటిని నింపుకోవచ్చు.. ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు అనవసర ఖర్చు నుంచి బయటపడవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.