Alcohol: మందుబాబులకు బిగ్ అలెర్ట్.. ఈ విషయాలు తెలిస్తే చెమటలు పట్టాల్సిందే..
తగు మోతాదులో రోజూ మద్యం సేవించడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అవేమి వాస్తవాలు కావని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ ఓ) స్పష్టం చేసింది. మానవ శరీరంలోకి వెళ్తున్న ఆల్కాహాల్ ప్రతి బొట్టు అనారోగ్యాన్ని కలుగజేస్తుందని తేల్చి చెప్పింది.

మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ స్లోగన్ చాలా సార్లు మనం విని ఉంటాం. కానీ దానిని అంత సీరియస్ గా తీసుకోం. ముఖ్యంగా మద్యపానం విషయంలో ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. తగు మోతాదులో రోజూ మద్యం సేవించడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అవేమి వాస్తవాలు కావని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ ఓ) స్పష్టం చేసింది. మానవ శరీరంలోకి వెళ్తున్న ఆల్కాహాల్ ప్రతి బొట్టు అనారోగ్యాన్ని కలుగజేస్తుందని తేల్చి చెప్పింది. తక్కువ మోతాదులో మద్యం తాగితే మంచి ఆరోగ్యమని చెబుతున్న మాటల్లో శాస్త్రీయమైన రుజువులు లేవని వివరించింది.
మద్యం క్యాన్సర్ కు కారణం..
ప్రపంచంలోనే మద్యం ఎక్కువ తాగే దేశాల్లో యూరోపియన్ దేశాలు మొదటి స్థానంలో ఉంటున్నాయి. ఆయా దేశాల్లో దాదాపు 200 మిలియన్ల మంది ప్రజలు కేవలం ఈ మద్యం ఎక్కువగా తాగుతుండటం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ ఓ నివేదికలో పేర్కొంది. డబ్ల్యూ హెచ్ ఓ డేటా ప్రకారం యూరోపియన్ రీజియన్ లో తక్కువ మోతాదులో మద్యం తాగుతున్న వారిలో కూడా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది.
ఏడు రకాల క్యాన్సర్లు..
ఆల్కాహాల్ కారణంగా దాదాపు ఏడు రకాల క్యాన్సర్ లు వస్తున్నాయని డబ్ల్యూహెచ్ ఓ చెబుతోంది. వీటిల్లో సాధారణంగా కనిపించే పేగు, రొమ్ము క్యాన్సర్లు కూడా ఉంటున్నాయని వివరిస్తోంది. ఈ ఆల్కాహాల్ శరీరంలోని అన్ని వ్యవస్థలను దెబ్బతిస్తుందని చెబుతోంది.



ఎటువంటి ఆధారం లేదు..
తక్కువ మోతాదులో మద్యం సేవించడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుందన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. ఈ వాదనను నిరూపించేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. మానవ శరీరంలో ప్రవేశిస్తున్న ఆల్కాహాల్ ప్రతి బొట్టు శరీరాన్ని గుల్ల చేసేందుకే ప్రయత్నిస్తుందని తేల్చి చెప్పింది. మీరు ఎంత తాగుతున్నారన్నది అసలు విషయం కాదని తాగుతున్నారా? లేదా అన్నదే ముఖ్యమని వివరిస్తోంది. తక్కువ తాగినంత మాత్రాన ప్రమాద తప్పిపోదని చెబుతోంది. ఎక్కువ తాగితే మరింత ఎక్కువ ప్రమాదని వివరించింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..