పెళ్లి తర్వాత నేరుగా ఆసుపత్రికి వెళ్లిన వధూవరులు.. పేషెంట్ గది లోపలికి వెళ్లి ఏం చేశారంటే..

ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ సమయంలో ఆసుపత్రికి నూతన వధూవరులు వచ్చారు. ఏంటా అని ఆరా తీయగా వరుడు తండ్రే ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పెద్దాయన రూమ్ లోకి వెళ్లిన నూతన దంపతులు..

పెళ్లి తర్వాత నేరుగా ఆసుపత్రికి వెళ్లిన వధూవరులు.. పేషెంట్ గది లోపలికి వెళ్లి ఏం చేశారంటే..
China Wedding
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 10, 2023 | 8:59 PM

ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ సమయంలో ఆసుపత్రికి నూతన వధూవరులు వచ్చారు. ఏంటా అని ఆరా తీయగా వరుడు తండ్రే ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పెద్దాయన రూమ్ లోకి వెళ్లిన నూతన దంపతులు.. ఉన్నట్టుండి కొన్ని సంప్రాదాయ క్రతువులను నిర్వహించారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. నూతన వధువు తన అత్తమామల ఇంటికి చేరుకోగానే.. ఆమె ఐదు గంటల పాటు ఒంటరిగా బయట ఉండవలసి వచ్చింది. ఎందుకంటే.. అత్తింటికి చేరుకునే క్రమంలో నూతన వధూవరులు కొన్ని ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం.. పెళ్లి కొడుకు తండ్రి నుంచి కొన్ని వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, పెళ్లి తర్వాత నూతన వధూవరులు ఇంటికి చేరుకున్నారు. కానీ పెళ్లి కొడుకు తండ్రి ఆసుపత్రిలో కోమాలో ఉండటంతో.. సంప్రదాయ క్రతువులను నిర్వహించేందుకు ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒక వ్యక్తి పెళ్లి అనంతరం తన భార్యతో కలిసి తండ్రిని కలవడానికి ఆసుపత్రికి వచ్చాడు. ఈ సమయంలో అతని తండ్రి ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. ఆరు నెలల క్రితం బ్రెయిన్ హెమరేజ్ అయిందని, అప్పటి నుంచి స్పృహలోకి రాలేదు. ఈ క్రమంలో కొన్ని ఆచారాలను పాటించాల్సి ఉండటంతో అక్కడికి చేరుకుని.. వాటిని నిర్వహించారు.

ఆసుపత్రికి వచ్చిన సమయంలో వధువు చేతిలో ఎర్రటి ప్యాకెట్ ఉంది. ఇద్దరూ అక్కడికి చేరుకోగానే ఆ ప్యాకెట్ ను వధువు తన మామ చేతిలో పెట్టింది. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేనప్పటికీ.. కొన్ని ఆచారాలను నిర్వహించి దంపతులిద్దరూ ఆయన చేతిలోంచి ప్యాకెట్ తీసుకున్నారని పేర్కొంది. కొంత సేపు అక్కడే నిలబడి సంప్రదాయ పద్దతులను పాటించారని వార్తలో వివరించింది.

ఇవి కూడా చదవండి

అయితే, పెళ్లి అనంతరం నూతన వధూవరులు ఈ ఆచారాన్ని స్థానికంగా నిర్వహిస్తారని, వివాహం తర్వాత కొన్ని వస్తువులను.. వరుడి తండ్రి కొత్త జంటకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నూతన జంట ఆనందంగా ఉంటుందని నమ్మకం. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని ఇలాంటి ఆచారాన్ని పాటిస్తారని పేర్కొంది.

Viral News

Viral News

నూతన జంట.. ఇలా చేయడానికి ముందు ఆసుపత్రి నుంచి అనుమతి పొందింది. వారికి ఆసుపత్రి సిబ్బంది కూడా సహాయం చేశారు. అయితే, నూతన జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కూడా ఇలాంటి ఆచారాలను నిర్వహించాల్సిన అవసరం ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో