ఇలా తయారయ్యారేంట్రా.. సూట్‌కేసుల నిండా గుట్కా ప్యాకెట్లు.. అనుమానం వచ్చి చెక్ చేయగా..

గుట్కా ప్యాకెట్లలో గుట్టుగా దాచిన సుమారు రూ.33 లక్షల విలువైన విదేశీ కరెన్సీ నోట్ల అక్రమ రవాణాను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకాక్‌ వెళ్తున్న ఒక ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా తయారయ్యారేంట్రా.. సూట్‌కేసుల నిండా గుట్కా ప్యాకెట్లు.. అనుమానం వచ్చి చెక్ చేయగా..
Gutkha Pouches
Follow us

|

Updated on: Jan 09, 2023 | 7:00 PM

స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. బంగారం, డ్రగ్స్, విదేశీ డబ్బు ఇలా ఎన్నో నిషేధిత వస్తువులను అక్రమగా దేశాలు దాటించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి ఇండియన్ కస్టమ్స్ అధికారులు కూడా దిమ్మతిరిగే షాకిస్తుంటారు. తాజాగా.. కోల్‌కతా కస్టమ్స్ అధికారులు భారీ స్మగ్లింగ్ ను చేధించారు. గుట్కా ప్యాకెట్లలో గుట్టుగా దాచిన సుమారు రూ.33 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు గుట్టుగా అక్రమ రవాణా చేస్తుండగా.. అనుమానం వచ్చి కస్టమ్స్‌ అధికారులు పరిశీలించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది.

ఆదివారం ఒక ప్రయాణికుడు కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు భారీగా లగేజ్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో కోల్‌కతా కస్టమ్స్‌కు చెందిన ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులకు అతని కదలికలు, లగేజ్ పై అనుమానం వచ్చింది. దీంతో ట్రాలీ సూట్‌కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వాటి నిండా గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. దీనిపై అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి చెక్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ క్రమంలో గుట్కా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డాలర్లను ఓ రేపర్లో చుట్టి గుట్కా ప్యాకెట్లలో సెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన విదేశీ కరెన్సీ విలువ రూ.32 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..