- Telugu News Photo Gallery COVID 19 and male infertility: coronavirus affeats fertility of men know about it shocking study report
Infertility: కొంపముంచుతున్న కరోనా.. పురుషుల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడి, శారీర శ్రమ తగ్గడం, అనారోగ్యకరమైన ఆహారం.. ఇలా పలు కారణాలు పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Updated on: Jan 07, 2023 | 1:57 PM

ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడి, శారీర శ్రమ తగ్గడం, అనారోగ్యకరమైన ఆహారం.. ఇలా పలు కారణాలు పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య వచ్చిన ఓ నివేదిక అందరినీ షాకింగ్ కు గురిచేసింది. కరోనా కారణంగా పురుషుల సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుందని నివేదిక పేర్కొంది. కరోనా సోకినపుడు పురుషుల వీర్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కరోనా రోగులపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. కరోనా పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు.

కరోనా సోకిన పురుషుల వీర్యంపై చేసిన అధ్యయనంలో ఇన్ఫెక్షన్ తర్వాత, వీర్యం నాణ్యత మునుపటిలాగా లేదని కొనుగొన్నారు. ఢిల్లీ, పాట్నా, మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ అధ్యయనం జరిగింది. ఇందులో ఈ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

పాట్నా ఎయిమ్స్‌లో 2020 సంవత్సరంలో అక్టోబర్ నుండి ఏప్రిల్ 2021 వరకు, కరోనా సోకిన 19 నుంచి 43 సంవత్సరాల వయస్సు గల 30 మంది పురుషులను అధ్యయనంలో చేర్చారు.

వీర్యం తీసుకున్న పురుషులకు మొదటి స్పెర్మ్ కౌంట్ పరీక్ష ఇన్‌ఫెక్షన్ తర్వాత చేశారు. తర్వాత రెండున్నర నెలల తర్వాత వీరందరి వీర్యాన్ని పరీక్షించగా, ఇన్ఫెక్షన్ సోకిన పురుషుల వీర్యం నాణ్యత చాలా బలహీనంగా ఉన్నట్లు పరీక్షలో తేలింది.

మొదటి పరీక్ష, మళ్లీ వీర్యం నమూనాలను పరిశీలించినప్పుడు కూడా కరోనా సంక్రమణకు ముందు ఉన్న స్పెర్మ్ నాణ్యతను గుర్తించలేదని పేర్కొన్నారు. కరోనా స్పెర్మ్ కౌంట్‌ను కూడా ప్రభావితం చేస్తుందని ఇది చూపిస్తుందన్నారు.





























