Top Electric Scooters: ఒక్కసారి చార్జింగ్ పెడితే 320 కి.మీ.లు తగ్గేదే లే.. అధిక మైలేజీ ఇచ్చే టాప్ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

e-Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఎక్కువ దూరం మైలేజీ ఇచ్చే వెహికిల్స్ కోసమే వెతుకుతున్నారుగా.. అందుకోసం పలు రకాల ఆప్షన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 07, 2023 | 2:13 PM

Ather 450X: ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ మైలేజీ విషయంలో దుమ్మురేపుతోంది. ఈ స్కూటర్ ఒక్క చార్జ్ మైలేజీ రేంజ్ 146 కిలోమీటర్లు. ట్రూరేంజ్ 105 కిలోమీటర్లు. 3.3 సెకన్లలోనే 0.40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.36 లక్షల నుంచి ఉంది. గరిష్టంగా రూ. 1.58 లక్షల వరకు ఉంది.

1 / 7
iVOOMi S4: ఐవూమి ఎస్1 స్కూటర్ 4.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఉండడం వల్ల అధిక మైలేజీని ఇవ్వగలుగుతోంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ 240 కిలోమీటర్లు వెళ్తుంది. డ్యూయెల్ బ్యాటరీ ఉంటుంది. మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 69,999 నుంచి ప్రారంభం అవుతుంది. రూ. 1.21 లక్షల వరకు ఉంది.

2 / 7
Okaya Faast F4: ఒకయ ఫాస్ట్ ఎఫ్4 మేలేజీ విషయంలో వెనుచూపు లేకుండా దూసుకుపోతోంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ 150 కిలోమీటర్ల మేర వెళ్తుంది. టాప్ స్పీడ్ 60 నుంచి 70 కిలోమీటర్లు. దీని రేటు రూ. 1.09 లక్షల నుంచి ఉంది. ఈ స్కూటర్‌ను కేవలం రూ.2,500తో బుక్ చేసుకోవచ్చు.

3 / 7
Okinawa Okhi90: ఒకినావా ఓహి90 స్కూటర్ మైలేజీ రేంజ్ 160 కిలోమీటర్లు. 60 ఇంచ్ అలాయ్ వీల్‌తో మార్కెట్‌లో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం దీని విశిష్టత. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.86 లక్షలు. రూ. 2 వేలతో ప్రిబుక్ చేసుకోవచ్చు

4 / 7
Ola Electric S1 Pro: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో మేలేజీ రేంజ్ 181 కిలోమీటర్లు. దీంతో రోడ్లపై అదరగొట్టేస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 115 కిలోమీటర్లు. రియల్ టైమ్‌లో అయితే ఈ స్కూటర్ రేంజ్ 135 కిలోమీటర్ల వరకు ఉంది. అయితే ఇటీవల తెచ్చిన మూవ్ ఓఎస్2 వద్ద ఎకో మోడ్‌లో 170 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓలా స్కూటర్ ధర రూ. 1.39 లక్షలు.

5 / 7
 Gravton Quanta: ఒక్కసారి చార్జింగ్ పెడితే గ్రేవ్‌టన్ క్వాంటా  ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 320 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. డ్యూయెల్ బ్యాటరీ ఆప్షన్‌తో ఈ దూరం ప్రయాణించగల ఈ స్కూటర్ స్కూటర్ ప్రియులకు ఆకర్షిస్తోంది. అదే సింగిల్ బ్యాటరీ అయితే 150 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99,999.

6 / 7
Vida V1: విదా వీ1 కూడా మార్కెట్లోకి వచ్చింది. హీరో కంపెనీ దీన్ని తెచ్చింది. ఈ స్కూటర్ రేంజ్ 165 కిలోమీటర్లు.  దీనిలో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. విదా వీ1 ప్రోకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉంది. విదా వీ1 ప్లస్ అయితే 142 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. దీని రేటు రూ.1.28 లక్షల నుంచి ఉంది.

7 / 7
Follow us