Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై తాగుబోతు హల్‌చల్‌.. ట్రాఫిక్‌ జామ్‌లో టైమ్ వేస్ట్ కాకుండా ఏం చేశాడంటే..!

రద్దీ ప్రదేశంలోని ట్రాఫిక్‌ జామ్‌లో కనిపించి ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందించారు.

Viral Video: నడిరోడ్డుపై తాగుబోతు హల్‌చల్‌.. ట్రాఫిక్‌ జామ్‌లో టైమ్ వేస్ట్ కాకుండా ఏం చేశాడంటే..!
Cars Roof
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2023 | 6:33 PM

నిత్యం హారన్ శబ్దాలు, ట్రాఫిక్‌ జామ్‌తో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర చికాకు కలిగిస్తుంది. అలాంటి ట్రాఫిక్‌ ఇరుక్కుపోయిన వారిని కదిలిస్తే.. కస్సుమని కోపంతో పాములా పైకి లేస్తారు..కానీ, అలాంటి ట్రాఫిక్‌ చిక్కుల్లోనూ ఓ వ్యక్తి ప్రశాంతంగా కనిపించాడు..అందరిలోనూ తాను స్పెషల్ అన్నట్టుగా ఏకంగా రద్దీ రహదారిపై ట్రాఫిక్‌ మధ్యలో కారు పైకప్పుపై కూర్చుని మందుకొడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కారు పైన కూర్చుని ప్రశాంతంగా మద్యం సేవిస్తూ కనిపించాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి సైతం పైన్నుంచి మందు సప్లై చేస్తున్నాడు. రద్దీ ప్రదేశంలోని ట్రాఫిక్‌ జామ్‌లో కనిపించి ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను రవి హందా అనే నెటిజన్‌ జనవరి 7వ తేదీన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘గురుగ్రామ్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 30వేల మందికిపైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.