Aconite Flower: అవన్నీ మత్తెక్కించే వాసనతో ఆకర్షించే పూలు.. తీరా దగ్గరికెళితే మరణమే..!
మధుమేహం , పక్షవాతం మొదలైన వ్యాధులకు ఔషధాల తయారీలో ఈ పువ్వును ఉపయోగిస్తారని చెబుతారు. ఈ ఔషధాన్ని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంటుందట.

ఇళ్లను అలంకరించేందుకు పూలను ఉపయోగిస్తారు. వివాహ వేడుకలు, పూజలు, ఆచారాలలో పూలను ఎక్కువగా వాడుతుంటారు. మన జీవితంలో పువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో విధంగా పూలతో ముడిపడివుంటుంది. అలాంటి పువ్వులు..అందంగా ఆకర్షణీయంగా, సువాసన గుప్పించేవిగా ఉంటాయి. కొన్ని పువ్వుల రంగు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, అటువంటి పువ్వు మరణానికి కారణమవుతుందని తెలిస్తే మీరు నమ్మగలరా..? అవును అందమైన కొన్ని పూలు ప్రాణాలు హరింపజేసేవిగా ఉంటాయి. ఈ పువ్వు పరిమళం మత్తెక్కిస్తుంది. పొరపాటున దీన్ని నోటిలో పెట్టుకుంటే ఇక అంతే.. మరణం ఖాయం. ఎందుకంటే ఇది విషపూరితమైన పువ్వు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఈ పువ్వు పేరు అకోనైట్. ఇది దాదాపు 10,000 అడుగుల ఎత్తులో హిమాలయ మైదానాలలో కనిపిస్తుంది. ఇది హిమాలయ పర్వతాలలో నమిక్, హిరమణి హిమానీనదాల చుట్టూ కనిపిస్తుంది. జూలై,ఆగస్టులో ఇక్కడ నీలం పువ్వులు వికసిస్తాయి. ఇది విషపూరితమైన పువ్వు అని చెబుతారు. కానీ వీటిని మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఇది యాంజియోస్పెర్మిక్ మొక్క. వేరు, కాండం, ఆకు, పండు, పువ్వు, గింజలతో కూడిన మొక్క ఇది. కానీ, ఈ పువ్వు చాలా ప్రమాదకరమైనది. దాని చుట్టూ గడ్డి కూడా పెరగదు. అంతటి విషం ఈ పువ్వులో ఉంటుంది.
మధుమేహం , పక్షవాతం మొదలైన వ్యాధులకు ఔషధాల తయారీలో ఈ పువ్వును ఉపయోగిస్తారని చెబుతారు. ఈ ఔషధాన్ని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంటుందట. ఈ పువ్వును ఆ పద్ధతిలో ఉపయోగిస్తారు. ఈ పూల మొక్క చుట్టూ మరే ఇతర మొక్క పెరగదు కాబట్టి, ఈ పువ్వు ఎంత ప్రమాదకరమో తెలుసుకోవచ్చు. ఏదైన జంతువులు పొరపాటున ఈ మొక్క ఆకులను తింటే అది తక్షణమే చనిపోతుందని నిపుణులు చెబుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.