16 ఏళ్లకే వ్యాపారంలో అడుగు పెట్టా.. కాలేజీ చదువులేనందుకు చింతిస్తున్నా: అపర కుభేరుడు అదానీ

16 ఏళ్లకే చదువుకు స్వస్తిపలికి వ్యాపారంలోకి అడుగుపెట్టిన అదానీ కాలేజీ విద్యను అభ్యసించలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గుజరాత్‌లోని పాలన్‌పుర్‌ విద్యామందిర్‌ ట్రస్ట్‌ 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న అదానీ పలు ఆసక్తికర..

16 ఏళ్లకే వ్యాపారంలో అడుగు పెట్టా.. కాలేజీ చదువులేనందుకు చింతిస్తున్నా: అపర కుభేరుడు అదానీ
Gautam Adani
Follow us

|

Updated on: Jan 10, 2023 | 8:01 AM

దేశ వ్యాప్తంగా దాదాపు 22 రాష్ట్రాల్లో తన కంపెనీలను విస్తరించిన అదానీ గ్రూప్‌ అధినేత ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. నాలుగు దశాబ్ధాల కాలంలో  225 బిలియన్ల డాలర్ల టర్నోవర్ కలిగిన వ్యక్తిగా అవతరించాడు. 16 ఏళ్లకే చదువుకు స్వస్తిపలికి వ్యాపారంలోకి అడుగుపెట్టిన అదానీ కాలేజీ విద్యను అభ్యసించలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గుజరాత్‌లోని పాలన్‌పుర్‌ విద్యామందిర్‌ ట్రస్ట్‌ 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న అదానీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

16 ఏళ్లకు వ్యాపారంలోకి..

1978లో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే విద్యాభ్యాసినికి చరమగీతం పాటి స్వంతంగా ఏదైనా సాధించాలనే ఆశతో ముంబాయిలో అడుగుపెట్టాను. మూడేళ్ల తర్వాత తొలిసారిగా వజ్రాల వ్యాపారం చేస్తూ జపాన్ వ్యక్తితో చేసిన తొలి ట్రేడింగ్‌ రూ. 10,000 కమీషన్‌గా పొందాను. నేడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదగడానికి అదే నా తొలి అడుగు.

ఇంత స్థాయికి ఎదిగినా ఆ విషయంలో ఇప్పటికీ చింతిస్తున్నా..

తొలినాటి అనుభవాలు ఎన్నో నేర్పాయి. ఐతే ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ వల్ల జ్ఞాన సముపార్జన వేగంగా విస్తరిస్తుంది. కాలేజీ విద్యా ఎందుకు దూరం అయ్యానా అనే ప్రశ్న ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. జ్ఞానాన్ని పొందాలంటే ముందుగా అధ్యయనం చేయాలి. కాలేజీకి వెళ్లి ఉంటే ఇంకా వేగంగా నేర్చుకుని ఉండేవాడిని. టీనేజ్‌లో ఉన్నప్పుడు స్వతంత్రంగా ఎదగానే కోరికతో గుజరాత్‌ నుంచి ముంబాయికి వెళ్లేందుకు టికెట్‌ కొని ట్రైన్‌ ఎక్కాను. చేయాలనుకున్నది ఏదైనా నా స్వంతంగానే ప్రారంభించాలని అనుకున్నాను. ముంబాయిలో మా కజిన్ ప్రకాష్‌భాయ్ దేశాయ్ నన్ను మహేంద్ర బ్రదర్స్‌కు పరిచయం చేశాడు. అక్కడ నేను వజ్రాల వ్యాపారంలో మెలకువలు నేర్చుకుని, వ్యాపారాన్ని ప్రారంభించాను. మహేంద్ర బ్రదర్స్ వద్ద సుమారు మూడేళ్లు పనిచేసిన తర్వాత జపాన్‌కు చెందిన వ్యక్తితో తొలిసారి ట్రేడింగ్‌ చేశాను.

ఇవి కూడా చదవండి

రాబోయే 30 ఏళ్లు చాలా కీలకం..

ఎటువంటి అనుభం లేకుండా వ్యాపారం ప్రారంభించడంలో ఓ ప్రయోజనం ఉంది. అదేంటంటే నష్టాలు పెద్దగా రాకపోవడం. నిజానికి అదే వారి బలం. ఎటువంటి అంచనాలు లేకుండా నేను కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాను. 19 ఏళ్లు వచ్చాక అహ్మదాబాద్‌లో ఉంటున్న నా అన్న మహాసుఖ్‌భాయ్ వ్యాపారంలో సహాయం అందించేందుకు నన్ను పిలిచారు.1985లో నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ సరళీకృత విధానాలు నా వ్యాపారానికి ఎంతో దోహదం చేశాయి. తర్వాత 1991లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు మరింత ఊతమిచ్చాయి. రెండేళ్ల వ్యవధిలో దేశంలో అతిపెద్ద గ్లోబల్ ట్రేడింగ్‌ను సృష్టించాము. అలా నాకు 29 ఏళ్లు వచ్చేటప్పటికే అత్యంత వేగంగా మా వ్యాపారం విస్తరించింది. ఇక 1995లో గుజరాత్‌ తీర ప్రాంత అభివృద్ధికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత కలిసి వచ్చింది. ఉప్పు తయారీ చేసేందుకు సుమారు 40,000 ఎకరాల చిత్తడి భూమి, ఉప్పు ఎగుమతి చేసేందుకు ముంద్రాలో ఓ క్యాప్టివ్ జెట్టీని నిర్మించేందుకు అనుమతి లభించింది. ఈ విధంగా ఓడరేవులు, రైలు, వాయు, రోడ్లు, జల నెట్‌వర్క్‌లతో ప్రపంచ స్థాయిలో మా వ్యాపారం విస్తరించింది. రాబోయే 30 ఏళ్లలో భారతదేశం భారీ అవకాశాలను అంది పుచ్చుకుంటుంది. ఇది పెద్ద కలలు కనే సమయం అని అదానీ తన వ్యాపార ప్రయాణం గురించి వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.