AP Police Constable Hall Tickets: ఒక్కోపోస్టుకు 83 మంది పోటీ.. జనవరి 12 నుంచి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు..

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారం (జనవరి 7)తో ముగిసింది. దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా..

AP Police Constable Hall Tickets: ఒక్కోపోస్టుకు 83 మంది పోటీ.. జనవరి 12 నుంచి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు..
AP Police Constable Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 09, 2023 | 12:29 PM

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారం (జనవరి 7)తో ముగిసింది. ఎస్సై పోస్టులకు జనవరి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీ సర్కార్‌ విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు గానూ దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు.

కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 12 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచించింది. ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.