Railway Recruitment: ఇండియన్ రైల్వేలో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
భారతీయ రైల్వే పలు జోన్లలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-24కి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ సెంట్రల్ రైల్వే (SER), నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR)లో ఉన్న ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా..
భారతీయ రైల్వే పలు జోన్లలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-24కి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ సెంట్రల్ రైల్వే (SER), నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR)లో ఉన్న ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 7914 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎస్‌సీఆర్‌లో 4103 (ఏసీ మెకానిక్ 250, కార్పెంటర్ 18, డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రీషియన్ 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ 71, ఎఎటీఎం 5, ఎఎండబ్ల్యూ 24, పెయింటర్ 80, వెల్డర్ 553), ఎస్‌ఈఆర్ 2026, ఎన్‌డబ్లూఈఆర్ 1785 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 పాసై, ఐటీఐలో సంబంధిత ట్రేడ్ చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎన్‌సీఆర్ దరఖాస్తుల స్వీకరణకు జనవరి 29, ఎస్‌ఈఆర్ దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 2, ఎన్‌డబ్ల్యూఆర్ పోస్టులను ఫిబ్రవరి 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య , ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..