AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఆగివున్న బస్సును ఢీ కొట్టిన మరో బస్సు.. 40 మంది స్పాట్ డెడ్..78 మందికి తీవ్రగాయాలు..

ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును మరోక బస్సు ఢీ కొనడంతో దాదాపు 40 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అనేక మంది తీవ్రగాయాలపాయ్యారు..

Road Accident: ఆగివున్న బస్సును ఢీ కొట్టిన మరో బస్సు.. 40 మంది స్పాట్ డెడ్..78 మందికి తీవ్రగాయాలు..
Tragic Road Accident
Srilakshmi C
|

Updated on: Jan 09, 2023 | 10:50 AM

Share

ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును మరోక బస్సు ఢీ కొనడంతో దాదాపు 40 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అనేక మంది తీవ్రగాయాలపాయ్యారు. పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్‌ సెనెగల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. కాఫ్రైన్ ప్రాంతంలోని గ్నివి గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల 30 నిముషాలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు టైర్‌ పంక్చర్‌ కావడంతో రోడ్డుకు అడ్డంగా ఓ బస్సు ఆగి ఉంది. అటుగా వస్తున్న మరో బస్సు ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 78 మంది గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధ్యక్షుడు మాకీ సాల్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన ట్వీట్‌లో సాల్ పేర్కొన్నారు.

అంతేకాకుండా సోమవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు కూడా. రోడ్డు భద్రతా చర్యలపై మంత్రిత్వ మండలితో చర్చిస్తామని తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరి రెండు బస్సులు ఢీకొన్నాయి. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారు. అధ్వాన్నమైన రోడ్లు, కాలం చెల్లిన కార్లు, డ్రైవర్లు నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం వల్ల తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..