పన్నెండేళ్ల బాలుడికి గుండెపోటు.. క్షణాల్లో మృతి..!
ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన గుండెపోటు పన్నెండేళ్లకే వచ్చి ఓ బాలుడు మృతి చెందాడు. అప్పటి వరకూ ఆడుతూపాడుతూ కళ్లముందు తిరిగిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు. వివరాల్లోకెళ్తే..

కర్ణాటకలోని మడికేరి జిల్లాలో కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేసే మంజాచారి కుమారుడు కీర్తన్. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు కీర్తన్. శనివారం (జనవరి 7) సాయంత్రం హుషారుగా ఆడుకున్నాడు. చీకటిపడటంతో ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటికి గుండెలో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి బాధతో విలవిల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కుశాలనగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు, అప్పటికే గుండెపోటువల్ల మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కీర్తన్‌కు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కళ్లముందే కన్న కొడుకు ప్రాణం వదలడం జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.