Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. వంద రోగాలను ఇట్టే మాయం చేస్తుంది..!

బుడమకాయలు తెలియని వారండరు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఐతే ఆరోగ్యానికి ఇవి చేసే మేలు తెలియక ఇన్ని రోజులూ వీటిని పనికిరాని మొక్కలుగా భావించాం. ఈ మొక్క ఆకులు, వీటి కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు..

ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. వంద రోగాలను ఇట్టే మాయం చేస్తుంది..!
Physalis Minima
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2023 | 6:00 PM

బుడమకాయలు తెలియని వారండరు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఐతే ఆరోగ్యానికి ఇవి చేసే మేలు తెలియక ఇన్ని రోజులూ వీటిని పనికిరాని మొక్కలుగా భావించాం. ఈ మొక్క ఆకులు, వీటి కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయ పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ దీనిలోని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బుడమకాయలను నేరుగా కూడా తినవచ్చు. ఈ కాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, క్యాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. బుడమకాయల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువసేపు ఆకలి అనిపించదు. తద్వారా బరువు తగ్గించడానికి సహాయ పడతాయి. బుడమకాయలతో కూరలు కూడా వండుకోవచ్చు. చెడు కొలెస్ట్రాలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మరింత మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

వీటిని తినడం వల్ల కాలేయం పనితీరును మెరుగు పరచడమే కాకుండా కామెర్ల చికిత్సలో కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌ కారకాలు యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది. అంటే వృద్ధాప్యఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. ఇన్ని ఔషధగుణాలు ఉన్నాయి గనుకనే ఈ మొక్క ఎక్కడ కనిపించినా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.