Watch Video: ‘మీరిచ్చే టీ నేను తాగను..! దాంట్లో విషయం కలిపారేమో..?’: అఖిలేష్ యాదవ్
పోలీసులు ఇచ్చిన టీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిరాకరించారడు. మనీష్ జగన్ అగర్వాల్ అరెస్ట్‌పై ప్రశ్నించడానికి లక్నోలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు..
పోలీసులు ఇచ్చిన టీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిరాకరించారడు. మనీష్ జగన్ అగర్వాల్ అరెస్ట్‌పై ప్రశ్నించడానికి లక్నోలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలేష్ యాదవ్ చేరుకున్నాడు. సుమారు 2 గంటలపాటు ఆయన అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఇచ్చిన టీని తాగేందుకు అఖిలేష్ యాదవ్ నిరాకరించాడు. ‘నేను మీరు ఇచ్చే టీ తాగను. మీరు నాకు విషం ఇస్తే? నాకు నమ్మకం లేదు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం బయటి నుంచి టీ తీసుకురావల్సిందిగా తమ పార్టీకార్యకర్తకు పురమాయించాడు.
కాగా ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీస్ జగన్ అగర్వాల్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్నోలోని పోలీస్ ప్రధాన కార్యాలయం మందు నిరసన తెలిపారు. పోలీసులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి మనీష్ జగన్ అగర్వాల్‌ను పరామర్శించేందుకు అఖిలేష్ యాదవ్ లక్నో జైలుకు వెళ్లారు. సమాజ్ వాదీ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మనీష్ జగన్ అగర్వాల్‌పై మూడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
#WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया।
उन्होंने कहा,”हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।”
(वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82
— ANI_HindiNews (@AHindinews) January 8, 2023
पुलिस मुख्यालय लखनऊ में मौजूद माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी, अब भी कोई जिम्मेदार व्यक्ति उपस्थित नहीं। @Uppolice pic.twitter.com/kRugHcpUms
— Samajwadi Party (@samajwadiparty) January 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.