Cattle Jatra: స్కిన్ వ్యాధి అంటూ చారిత్రక పశువుల జాతర రద్దు.. మాకు ప్రభుత్వ సాయం వద్దు.. జాతర ముద్దు అంటోన్న రైతులు
సుమారు ఈ జాతరకు సుమారు 20 వేల వరకూ పశువులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతరకు బయట జిల్లాల నుంచి వందలాది మంది .. పశువులను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు.

గత కొంత కాలంగా పశువులను లంపి చర్మవ్యాధి పట్టి పీడిస్తున్న సంగతి తెల్సిందే.. పశువుల్లోని ఈ వ్యాధి ప్రభావం సంస్కృతి, సాంప్రదాయ వేడుకలపై పడింది. ఈ వ్యాధి కారణంగా చారిత్రక కర్ణాటకలోని బుకనబెట్ట రంగనాథ స్వామి పశువుల జాతర మహోత్సవాన్ని రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎంఎస్ అర్చన ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 6 నుంచి జనవరి 22 వరకు జిల్లా వ్యాప్తంగా గోవులు, ఎద్దుల జాతరను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుక్కనబెట్ట ప్రవేశ ద్వారం వద్ద పశువుల సంతను రద్దు చేసినట్లు ముజ్రాయి శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
గత వారం స్థానిక ఎమ్మెల్యే సీఎన్ బాలకృష్ణ రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు రోజుల పాటు పశువుల సంత నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఒక్కసారిగా జాతరను నిషేధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల పాటు అయినా పశువుల జాతరకు అనుమతించాలని పట్టుబడుతున్నారు.
రైతులు తమ పశువులను జాతరకు తరలించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది యజమానులు ఫుడ్, వ్యవసాయ పరికరాల దుకాణాలు, హోటళ్లను తెరిచారు. అంతే కాకుండా బుకనబెట్టకు వచ్చే ఇరువైపులా అధికార యంత్రాంగం ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేసి పోలీసులను మోహరించింది.




సుమారు ఈ జాతరకు సుమారు 20 వేల వరకూ పశువులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతరకు బయట జిల్లాల నుంచి వందలాది మంది .. పశువులను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం పశువులకు చర్మవ్యాధి వ్యాపించడంతో జాతర మహోత్సవాన్ని రద్దు చేశారు. అయితే జాతరకు అనుమతించాలని ప్రజలు వేడుకుంటున్నారు. పశువులకు రోగాలు వస్తే ప్రభుత్వ సాయం మాకు అక్కర్లేదు. మూడు రోజుల పాటు జాతర నిర్వహణకు అనుమతించాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బుక్కనబెట్ట రంగనాథస్వామి 92వ రాసు జాతర మహోత్సవాలు రేపటి నుంచి జరగాల్సి ఉంది. చర్మవ్యాధుల కారణంగా నిషేధం విధించడంతో.. మూడు రోజుల పాటు జరిగే జాత్రా మహోత్సవానికి అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి