Chicken Price: సామాన్యుడికి షాక్! అక్కడ కేజీ చికెన్ ధర అక్షరాలా 650 రూపాయలు..
చికెన్ ధరలు చెట్టెక్కి కూర్చున్నాయ్! ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఇక కష్టకాలం మొదలైనట్లే. ఎందుకంటే రూ.200ల కేజీ చికెన్ ధర ఏకంగా రూ.650లు ఎగబాకింది..
చికెన్ ధరలు చెట్టెక్కి కూర్చున్నాయ్! ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఇక కష్టకాలం మొదలైనట్లే. ఎందుకంటే రూ.200ల కేజీ చికెన్ ధర ఏకంగా రూ.650లకు ఎగబాకింది. సామాన్యుడికి చికెన్ అందనంత స్థాయికి చేరుకుంది. పైగా ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ గడ్డుకాలంలో ప్రొటీన్లు పుష్కలంగా పట్టాలంటే చికెన్ తినలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి అక్షరాల మన పొరుగున్న పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొంది. గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్ ప్రస్తుతం పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో ఆ దేశ ప్రజలు ప్లాస్టిక్ కవర్లలో గ్యాస్ నింపుకుని దినదినగండంగా బతుకీడుస్తున్నారు. పాక్‌లో ఒక్క ఎల్పీజీ సిలిండర్ ధర అక్షరాలా రూ.10,000 పాకిస్థాన్ రూపాయలకు చేరుకుంది.
గతేడాది (2022) శ్రీలంక ఎదుక్కొన్న అత్యంత గడ్డు పరిస్థితులనే ప్రస్తుతం పాకిస్థాన్ చవిచూస్తోంది. లంక దారుణ పరిస్థితులను ప్రపంచం మరచిపోకముందే ప్రస్తుతం పాకిస్థాన్ అదే మార్గంలో పయనిస్తోంది. అక్కడ ద్రవ్యోల్బణం రేటు పైపైకి ఎగబాకుతోంది. ఆహారాలు మాత్రమేకుకుండా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కరెంటు ఇలా అన్నింటి రేట్లు కొండెక్కాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ద్రవ్యోల్బణం రేటు 24.5 శాతానికి చేరుకుంది. ఆ దేశ ప్రజల దుర్భర జీవనం కలవరపెడుతోందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.