నిర్లక్ష్యానికి పరాకాష్ట..13 రోజులుగా ఆసుపత్రిలో మృతదేహం కుళ్లిపోతున్నా..

ఆసుపత్రిలో 13 రోజులుగా మృతదేహం కుళ్లిపోతున్నా వైద్యులు నిమ్మకునీరెత్తినట్లు ఉన్నారు. బంధువులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, వైద్యులపై..

నిర్లక్ష్యానికి పరాకాష్ట..13 రోజులుగా ఆసుపత్రిలో మృతదేహం కుళ్లిపోతున్నా..
Sangareddy Crime
Follow us

|

Updated on: Jan 06, 2023 | 4:30 PM

ఆసుపత్రిలో 13 రోజులుగా మృతదేహం కుళ్లిపోతున్నా వైద్యులు నిమ్మకునీరెత్తినట్లు ఉన్నారు. బంధువులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, వైద్యులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు తీరు మరోలా ఉంది. వివరాల్లోకెళ్తే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రోల్ల చిన్న (28) అనే యువకుడు డిసెంబర్‌18న సుల్తాన్ పూర్‌లో జరిగిని ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. 108 వాహనానంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిసెంబర్‌ 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గత నెల 23న చిన్న మృతి చెందాడు. వెంటనే ఆసుపత్రి వర్గాలు సంగారెడ్డి టౌన్ పుల్కల్ పోలీసులకు సమాచారం అందించి, మృత దేహాన్ని మార్చురికి తరలించారు.

ఈ రోజు (జనవరి 6) మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని అప్పగించే క్రమంలో శ్రీనివాస్ జేబులో ఆధార్ కార్డ్ లభ్యమైంది. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు మున్సిపల్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. యాక్సిడెంట్ అయినప్పుడు, కనీసం మృతి చెందినప్పుడైనా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. తన భర్తను పోలీసులు, వైద్యులే చంపారని మృతుడి భార్య ఆరోపించారు. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని మృతుడి భార్య డిమాండ్‌ చేసింది. మరోవైపు ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఓ మహిళ కడుపుపై పోలీసులు తన్నినందుకు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. సంగారెడ్డి డిఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.