AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం..! భార్యను హతమార్చి..రెండు ముక్కలుగా నరికి కాలువలో విసిరేశాడు..

నూరేళ్లు తోడుంటానని బాసలు చేసిన ఆ పతి దేవుడు కట్టుకున్న దాన్ని దారుణంగా హతమార్చాడు. అంతటితో కసితీరక ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి నదిలో విసిరేశాడు..

దారుణం..! భార్యను హతమార్చి..రెండు ముక్కలుగా నరికి కాలువలో విసిరేశాడు..
West Bengal Murder Case
Srilakshmi C
|

Updated on: Jan 05, 2023 | 9:41 PM

Share

నూరేళ్లు తోడుంటానని బాసలు చేసిన ఆ పతి దేవుడు కట్టుకున్న దాన్ని దారుణంగా హతమార్చాడు. అంతటితో కసితీరక ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి నదిలో విసిరేశాడు. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్నీ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..

రాష్ట్రంలోని సిలిగురి సబ్‌డివిజన్‌ పరిధిలో నివాసం ఉంటున్న రేణుకా ఖాతూన్ (30), మహ్మద్ అన్సారుల్‌కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు సిలిగురి వార్డ్ నెం. 43లోని దాదాభాయ్ కాలనీలో నివాసం ఉండేవారు. వివాహం అనంతరం వీరికాపురం కొంతకాలం సజావుగానే సాగింది. వీరికి కొడుకు కూడా ఉన్నాడు. ఐతే రేణుక అదే ప్రాంతంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని నేర్చుకునేందుకు వెళ్లడం ప్రారంభించింది. భర్త అయిన అన్సారుల్‌కు భార్యపై అనుమానం ఏర్పడింది. ఈ విషయమై దంపతులిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రేణుక డిసెంబర్ చివరి వారం నుంచి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా అన్సారుల్‌ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. డిసెంబర్ 24న అన్సారుల్ తన భార్యను హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి ఛత్‌ పక్కనే ఉన్న తీస్తా కాలువలోకి వేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసులు రేణుక మృత దేహం కోసం జనవరి 5న తీస్తా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. రేణుక కుటుంబ సభ్యులు తమ కూతురిని దారుణంగా హత్య చేసిన అన్సారుల్‌కు ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.