AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరమ పవిత్రమైన ఈ ఊరు గంటగంటకు కుంగిపోతోంది.. ఇళ్లకు పగుళ్లొచ్చి నీళ్లు ఉబికి వస్తున్నాయి!

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్‌ పెను ప్రమాదంలో చిక్కుకుంది. అక్కడ ఉన్నట్టుంది భూమిపై పగుళ్లు ఏర్పడి దాదాపు 570 ఇళ్లు కుంగిపోతున్నాయి. ఇళ్లకు పగుళ్లు..

పరమ పవిత్రమైన ఈ ఊరు గంటగంటకు కుంగిపోతోంది.. ఇళ్లకు పగుళ్లొచ్చి నీళ్లు ఉబికి వస్తున్నాయి!
Joshimath Sinking
Srilakshmi C
|

Updated on: Jan 05, 2023 | 3:20 PM

Share

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్‌ పెను ప్రమాదంలో చిక్కుకుంది. అక్కడ ఉన్నట్టుంది భూమిపై పగుళ్లు ఏర్పడి దాదాపు 570 ఇళ్లు కుంగిపోతున్నాయి. ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో ఇప్పటికే 60 కుటుంబాలు ఇళ్లను వదిలివెళ్లిపోయాయి. బుధవారం మరో 29 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలను తరలించారు. ఇప్పటికీ సుమారు 500ల కుటుంబాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ ఇళ్లలోనే ఉంటున్నారు. భూమి కుంగడంతో అక్కడ 3 వేల మంది ప్రజలు ప్రభావిత మయ్యారు. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇందుకు గల కారణాలను ఐఐటీ రూర్కీ పరిశోధన బృంధం సర్వే చేస్తోందని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. జోషిమత్‌లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి స్పందించారు. సర్వే నివేధిక వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌తో చర్చిస్తామన్నారు. త్వరలో ఈ పట్టణంలో పర్యటించి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

కారణం ఏమై ఉంటుందో..?

వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల కారణంగా ఆ పట్టణంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఇళ్లు మత్రమేకాదు రోడ్లు కూడా దారుణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ పగుళ్ల నుంచి నీళ్లు బయటకు ఉబికి వస్తున్నాయి. ఈ విధంగా భూమి పగుళ్ల నుంచి నీళ్లు రావడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లకు పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో వణికిపోతున్నారు. ఏం జరుగుతుంతో తెలియని అక్కడి నివాసితులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. నెలలుగా ఇక్కడి పరిస్థితి ఇలాగే ఉంది.

కాగా హిమాలయాల్లో పర్వతారోహణ యాత్రలకు ఈ పట్టణం ముఖ్య ఆకర్షణగా నిలిచింది. అక్కడ బద్రీనాథ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వరకు ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. జ్యోతిర్‌మఠ్‌ పీఠం హిందూ మతస్తులకు పరమపవిత్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.