New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనానికి ముహూర్తం ఫిక్స్.. ప్రారంభం ఎప్పుడంటే..
అన్నీ కుదిరితే వచ్చే మార్చిలోనే ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరిగే సమయంలో ఈ ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలన పనులను కూడా ఫిబ్రవరీలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే మార్చిలోనే ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరిగే సమయంలో ఈ ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి.
బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో..
2023 బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడత జనవరి 30 లేదా 31వ తేదీన రాష్ట్రపతి ప్రసంగంతో రెండు చట్ట సభలను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి ఒకటే తేదీన యూనియన్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటిస్తారు. దీని చర్చ ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీ వరకూ కొనసాగుతుంది. దీంతో తొలి విడత పూర్తవుతుంది. రెండో విడత సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభించే అవకాశాలున్నాయి. అప్పటి నుంచి మే మొదటి వారం వరకూ కొనసాగుతాయి. రెండో విడత జరిగే సమవేశాల సమయంలోనే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు పార్లమెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
శరవేగంగా నిర్మాణ పనులు..
2020 డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. దీనిని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మిస్తోంది. దీనిలో ప్రధాన హాలుతో పాటు లైబ్రెరీ, పార్లమెంట్ మెంబర్లకు లాంజ్, కమిటీ రూమ్స్, డైనింగ్ హాల్ వంటి వాటికి ప్రత్యేక స్పేస్ కేటాయించి నిర్మాణం చేపడుతున్నారు. గత నెలలో కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..