Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై కీలక ప్రకటన చేసిన అమిత్ షా.. ఆలయ ప్రారంభోత్సవం ఎప్పుడంటే..

2024 జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ రోజే ఆలయ ప్రారంభోత్సవం జరుపుకుంటామని స్పష్టం చేశారు. త్రిపురలోని ఓ సభలో పాల్గొన్న అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై కీలక ప్రకటన చేసిన అమిత్ షా.. ఆలయ ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
Ayodhya Ram Mandir will be inaugurated on January 1, 2024
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 05, 2023 | 9:36 PM

అయోధ్యలోని రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణ పనులు 2024 జనవరి 1 నాటికి పూర్తవుతాయని ప్రకటించిన అమిత్ షా మందిర ప్రారంభోత్సవ వేడుకలు కూడా అదే రోజున జరుగుతాయని పేర్కొన్నారు. గురువారం త్రిపురలోని ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. ఈ మహత్తరమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ రామ మందిర నిర్మాణ కేసును కోర్టుల్లో అడ్డుకుంటున్నదని, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని ఆయన కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు.

త్రిపురలోని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా ‘ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రామ మందిర సమస్యను కాంగ్రెస్‌ అడ్డుకుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం ప్రధాని మోదీ ఆగస్టు 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది’ అని అన్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024లోనే  జరగనున్నాయి. దాదాపు ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికలలో కూడా తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రామ మందిరంపై అమిత్ షా చేసిన ప్రకటన బీజేపీకి ఎంతో బలాన్ని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఇక తాజా ప్రణాళిక ప్రకారం రామ మందిరం పరిసరాల్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి, కేవట్, శబరి, జటాయువు, సీత, విఘ్నేశ్వరుడు (గణేష్), శేషావతార్ (లక్ష్మణుడు) ఆలయాలను కూడా నిర్మించనుంది ఆలయ ట్రస్ట్. ఆలయ విస్తీర్ణం, దాని ప్రాంగణంతో సహా మొత్తం ఎనిమిది ఎకరాల భూమిని కలుపుతూ దీర్ఘచతురస్రాకారంలో రెండు అంతస్తుల ప్రదక్షిన దారిని కూడా నిర్మించనున్నారు. దాని తూర్పు భాగంలో ఇసుకరాయితో చేసిన ప్రవేశ ద్వారం ఉంటుంది. రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుండి తెల్లటి పాలరాయిని ఆలయ గర్భగుడి లోపల ఉపయోగించనున్నారు.

ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.