Crime News: హృదయవిదారక ఘటన.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొన్న కారు.. ఆ తర్వాత 500 మీటర్లు లాక్కెళ్లి..

నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు..

Crime News: హృదయవిదారక ఘటన.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొన్న కారు.. ఆ తర్వాత 500 మీటర్లు లాక్కెళ్లి..
Swiggy Delivery Boy
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2023 | 5:14 PM

నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా దేశ రాజధానిలో మహిళను కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాలోకెళ్తే..

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కౌశల్ యాదవ్ ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. నోయిడాలోని సెక్టార్ 14లో ఫ్లైఓవర్ దగ్గర అతని ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత బాధితుడిని అర కిలోమీటరు వరకు కారు ఈడ్చుకెళ్లింది. అనంతరం కారు డ్రైవర్‌ గుడి సమీపంలో కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనలో కౌశల్ యాదవ్ మృతి చెందాడు. అతని మృతదేహం దారుణంగా నలిగిపోయింది. స్థానికులు గమనించి మృతుడి వద్ద ఉన్న ఫోన్‌ ద్వారా అతని సోదరుడికి సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై స్విగ్గీ స్పందిస్తూ.. కౌశల్ యాదవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు భీమా పరిహారం అందిచడంతోపాటు పోలీసులకు చట్టపరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ