Pet Dog: ఈ జాగిలం చాలా స్పెషల్ గురూ.. ఏకంగా రూ.20 కోట్లతో కొనుగోలు చేసిన హైదరాబాద్ వాసి!
తాజాగా ఓ జంతుప్రేమికుడు ఏకంగా రూ.20 కోట్లు పెట్టి శునకాన్ని కొనుగోలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన డాగ్ బ్రీడ్‌లను విక్రయించే నగరాల్లో బెంగళూరు..
కొందరు పెంపుడు జంతువులను ఎంతో ఇష్టం పెంచుకుంటుంటారు. ముఖ్యంగా పెడ్ డాగ్‌లను చాలా మంది ఇళ్లలో ముద్దుముద్దుగా, తమ ఇంటి కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. తాజాగా ఓ జంతుప్రేమికుడు ఏకంగా రూ.20 కోట్లు పెట్టి శునకాన్ని కొనుగోలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన డాగ్ బ్రీడ్‌లను విక్రయించే నగరాల్లో బెంగళూరు ప్రసిద్ధి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సతీష్ అనే వ్యక్తి అత్యంత అరుదైన క్యాడబామ్స్ కెన్నెల్ డాగ్ బ్రీడ్‌ను రూ. 20 కోట్లకు కొనుగోలు చేశాడు. నిజానికి ఈ శునకాన్ని కొనుగోలు చేసిన సతీష్‌కు ఇండియన్ డాగ్ బ్రీడ్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్. ఇప్పటికే పలు అరుదైన జాతులకు చెందిన శునకాలను సతీష్ పెంచుతున్నాడు.
ఇక సతీష్ తాజాగా కొనుగోలు చేసిన క్యాడబామ్స్ కెన్నెల్ జాతికి చెందిన శునకం రష్యా, టర్కీ, అర్మేనియా, సిర్‌కాసియా, గార్జియా వంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ విధమైన శునకాలు మన దేశంలో కనిపించడం చాలా అరుదు. ఈ జాతి జాగిలాలు 20 నుంచి 30 ఇంచుల వరకు పెరుగుతాయి. 45 నుంచి 77 కేజీల వరకు బరువు ఉంటాయి. వీటి జీవిత కాలం 10 నుంచి 12 ఏళ్ల వరకు ఉంటుంది. తన వద్ద ఉన్న డాగ్ బ్రీడ్స్‌తో సతీష్ త్వరలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ చేయబోతున్నాడు. ఈ ఈవెంట్‌లో తన వద్ద ఉన్న అన్ని బ్రీడ్‌లను ప్రదర్శనకు ఉంచుతాడట.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.