TS High Court Recruitment 2023: తెలంగాణ జిల్లా కోర్టుల్లో కొలువుల జాతర.. పదో తరగతిపాసైన వారు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసకోవచ్చు..

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసు కింద వివిధ జిల్లా కోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 163 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు..

TS High Court Recruitment 2023: తెలంగాణ జిల్లా కోర్టుల్లో కొలువుల జాతర.. పదో తరగతిపాసైన వారు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసకోవచ్చు..
TS High Court Process Server Recruitment 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 04, 2023 | 5:35 PM

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసు కింద వివిధ జిల్లా కోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 163 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాషలో నైపుణ్యం, సంబంధిత స్కిల్స్‌ ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. ఓసీ/బీసీ కేటగిరీ అభ్యర్ధులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.22,900ల నుంచి రూ.69,150ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • భద్రాద్రి కొత్తగూడెంలో ఖాళీలు: 4
  • సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్లో ఖాళీలు: 15
  • సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్ లో ఖాళీలు: 2
  • హనుమకొండలో ఖాళీలు: 5
  • జోగులాంబ గద్వాలలో ఖాళీలు: 5
  • జగిత్యాలలో ఖాళీలు: 5
  • జనగామలో ఖాళీలు: 4
  • జయశంకర్ భూపాలపల్లిలో ఖాళీలు: 3
  • కుమ్రం భీం ఆసిఫాబాద్లో ఖాళీలు: 3
  • మహబూబాబాద్లో ఖాళీలు: 1
  • మహబూబ్ నగర్లో ఖాళీలు: 8
  • మంచిర్యాలలో ఖాళీలు: 2
  • మెదక్లో ఖాళీలు: 1
  • మేడ్చల్-మల్కాజిగిరిలో ఖాళీలు: 18
  • మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్, హైదరాబాద్లో ఖాళీలు: 4
  • ములుగులో ఖాళీలు: 3
  • నాగర్ కర్నూలులో ఖాళీలు: 7
  • నల్గొండలో ఖాళీలు: 3
  • నారాయణపేటలో ఖాళీలు: 4
  • నిజామాబాద్లో ఖాళీలు: 2
  • పెద్దపల్లిలో ఖాళీలు: 2
  • రాజన్న సిరిసిల్లలో ఖాళీలు: 3
  • రంగారెడ్డిలో ఖాళీలు: 27
  • సిద్దిపేటలో ఖాళీలు: 5
  • సూర్యాపేటలో ఖాళీలు:7
  • వికారాబాద్లో ఖాళీలు: 6
  • వనపర్తిలో ఖాళీలు: 6
  • వరంగల్లో ఖాళీలు: 5
  • యాదాద్రి భువనగిరిలో ఖాళీలు: 3

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.