TS Police Jobs: ‘ఎస్సై, కానిస్టేబుళ్ల మెయిన్స్‌ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.. అర్హత మార్కులు తగ్గించే ప్రసక్తే లేదు’

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 04, 2023 | 4:01 PM

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలకు పీఎంటీ, పీఈటీ పరీక్షలు జనవరి 5తో ముగియనున్నాయి. అనంతరం మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో..

TS Police Jobs: 'ఎస్సై, కానిస్టేబుళ్ల మెయిన్స్‌ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.. అర్హత మార్కులు తగ్గించే ప్రసక్తే లేదు'
TS Police Jobs

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలకు పీఎంటీ, పీఈటీ పరీక్షలు జనవరి 5తో ముగియనున్నాయి. అనంతరం మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రాథమిక రాతపరీక్షలో మాదిరి తుది పరీక్షల్లో కూడా అర్హత మార్కులను తగ్గించే అవకాశం ఉందనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. ప్రిలిమినరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకూ 60 మార్కులుగానే నిర్ణయించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో సీఎం ఆదేశాల మేరకు కటాఫ్‌ మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్‌ అభ్యర్థులకు 60, బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 40 మార్కుల్ని కటాఫ్‌గా ప్రకటించారు. ఈక్రమంలో తుది రాతపరీక్షలోనూ కటాఫ్‌ మార్కులు తగ్గింపు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా స్పష్టత ఇచ్చింది. మెయిన్‌ పరీక్షలో జనరల్‌ అభ్యర్థులు 80 మార్కులు, బీసీ అభ్యర్థులు 70 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు తప్పనిసరిగా సాధించవల్సిందేనని బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మెయిన్‌ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదని ఆయన అన్నారు.

ప్రిలిమినరీ రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానంలో నెగ్గి, శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ అర్హత సాధించగలిగితే సత్తా ఉన్నట్లుగా పరిగణించి తుది రాతపరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని తీసేసినట్లు బోర్డు పేర్కొంది. ఆయా వర్గాల అభ్యర్థులు అర్హత మార్కుల్ని సాధిస్తేనే తుది ఎంపిక ప్రక్రియ కోసం పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. మెయిన్‌ పరీక్షలో నిర్వహించే రెండు పేపర్లలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు మాత్రమే వస్తాయని, అందువల్లనే నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని తొలగించినట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu