RRC Recruitment 2023: పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా 1785 రైల్వే ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో.. 1785 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో.. 1785 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారికి నిబంధనలమేరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.