విషాదం..! రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టి టెకీ మృతి

చైన్నైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ టెకీ మంగళవారం (జనవరి 3) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీ కొంది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా..

విషాదం..! రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టి టెకీ మృతి
Woman Engineer Died In Chennai
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 04, 2023 | 6:28 PM

చైన్నైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ టెకీ మంగళవారం (జనవరి 3) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీ కొంది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన మృతురాలు శోభన (22) జోహో అనే ప్రైవేట్ టెక్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మంగళవారం తన సోదరుడిని స్కూటీపై నీట్‌ కోచింగ్‌ క్లాస్‌కు తీసుకెళ్తుండగా రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శోభన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అదే వాహనంపై ప్రయాణిస్తున్న ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలవ్వగా ఆస్పత్రికి తరగలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

ప్రమాద సమయంలో శోభన, అతని సోదరుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం ట్రక్‌ డ్రైవర్‌ పారిపోయాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమేరాల ద్వారా పారిపోయిన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు హెల్మెట్ ధరించకపోవడం, ట్రక్ డ్రైవర్ మోహన్‌ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ఓ పోలీసధికారి తెలిపాడు. ప్రమాదం జరిగిన రోడ్డుపై ఉన్న గుంతలను సివిక్ అధికారులు మరమ్మతులు చేసినట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.