AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: రోడ్డు దాటుతున్న పులుల కోసం వాహానాలను ఆపేసిన అటవీ అధికారి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

ప్రస్తుత కాలంలో అటవీ ప్రాంతాలను నిర్మూలించి మానవ సంచారం కోసం రోడ్లను నిర్మించడమనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కానీ అలా చేయడం వల్ల అడవులలో జీవించే ఎన్నో రకాల..

Maharashtra: రోడ్డు దాటుతున్న పులుల కోసం వాహానాలను ఆపేసిన అటవీ అధికారి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Tiger Crossing The Road
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 04, 2023 | 8:23 PM

ప్రస్తుత కాలంలో అటవీ ప్రాంతాలను నిర్మూలించి మానవ సంచారం కోసం రోడ్లను నిర్మించడమనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కానీ అలా చేయడం వల్ల అడవులలో జీవించే ఎన్నో రకాల జంతువులు తమ ఆశ్రయాన్ని కోల్పోతున్నాయి. అలాంటి దుర్భర పరిస్థితుల వల్లనే అడవులకు దగ్గరగా ఉండే గ్రామాలలో పులులు, చిరుతల సంచారం చేస్తున్నాయి. ఫలితంగా మానవ-జంతు ఘర్షణ పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పులి, ఇంకో పులి పిల్ల హైవే రోడ్డు దాటడాన్ని మనం చూడవచ్చు.

అంతేకాక అవి వెళ్లేందుకు వీలుగా అటవీ అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేయడాన్ని కూడా మనం గమనించవచ్చు. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ పులులు ఇతర వన్యప్రాణులు తడోబా నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లను దాటుతున్న క్రమంలో చనిపోతున్నాయి. NGT ఆదేశాలను మహారాష్ట్ర పీడబ్య్లుడీ, మహారాష్ట్ర అటవీ శాఖ ఎప్పుడు అమలు చేస్తారు..?  అయితే ఈ వీడియోలో రాష్ట్ర అటవీ శాఖాధికారులు చేసిన మంచి పనికి అభినందనలు. గతేడాది లాగానే ఈ సిబ్బంది కూడా పనిచేస్తున్నారా..?’ అనే కాప్షన్‌తో Milind Pariwakam అనే ట్విట్టర్ ఖాతాదారుడు పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

రోడ్డు దాటుతున్న పులి వీడియోను ఇక్కడ చూడండి..

కాగా ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 17 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే దాదాపు 5 వేల లైకులను కూడా ఆ వీడియో అందుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ సెక్షన్‌ ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..