AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: అద్దిరిపోయే అందంతో అద్భుతంగా డ్యాన్స్ వేసిన అమ్మాయిలు.. వీడియో చూడకపోతే చాలా మిస్సయినట్లే..

బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాక సూపర్ హిట్ పేరు తెచ్చుకున్న పుష్ప సినిమాలోని పాటల మైకం నుంచి యువత ఇప్పటికీ బయట పడడంలేదు. ఇక ఆ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అంటూ సమంత వేసిన

Trending Video: అద్దిరిపోయే అందంతో అద్భుతంగా డ్యాన్స్ వేసిన అమ్మాయిలు.. వీడియో చూడకపోతే చాలా మిస్సయినట్లే..
Girl Dancing For Oo Antava Mawa Song
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 04, 2023 | 7:08 PM

Share

అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్ హీరోగా చేసిన ‘పుష్ప ది రైజ్’ సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాక సూపర్ హిట్ పేరు తెచ్చుకున్న ఈ సినిమాలోని పాటల మైకం నుంచి యువత ఇప్పటికీ బయట పడడంలేదు. ఇక ఆ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అంటూ సమంత వేసిన స్టెప్పులయితే ముసలివారిలో కూడా పిచ్చెక్కించేశాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలను మీరు ఇదివరకే చూసి ఉంటారు. ఇప్పుడు కూడా ఊ అంటావా మావా పాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే వైరల్ అవుతున్న వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులనే కాక బెల్లీ డ్యాన్స్ కూడా చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారు. kkhushii_sharma అనే ఇన్‌స్టాగ్రామ్  ఖాతా ద్వారా షేర్ అయిన ఈ వీడియోలో.. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా పాటకు ఖుషీ శర్మ డ్యాన్స్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఆమె చేసిన డ్యాన్స్, హావాభావాలు అద్భుతంగా ఉండడమే కాక నెటిజన్లను కట్టిపడేసేలా ఉన్నాయి. అలాగే  ఖుషీ శర్మ వేసే స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను కూడా చేసేస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ‘ఊ అంటావా మావా..’ వీడియోను ఇక్కడ చూడండి.. 

ఇక వీడియోను పోస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల 80 వేల వీక్షణలను పొందడమే కాక సుమారు 28 వేల లైకులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘అద్భుత ప్రదర్శన’ అని కామెంట్ చేయగా, మరో నెటిజన్ ‘మీ అద్భుతమైన డ్యాన్స్‌ను ప్రశంసించడానికి మాటలు లేవు’ అని రిప్లై ఇచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల సెక్షన్‌లో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..