Viral Video: ఎవరి అభిరుచి వారిదిలే.. బురద స్నానం చేస్తూ సుఖపడుతున్న కుక్క.. వైరల్ వీడియో మీ కోసం..

సరదాగా అలా ఇంటి బయటకు నడుచుకుంటూ వెళ్లి తోటి కుక్కలతో ఊరంతా తిరిగి రావాలని ఏ కుక్కకు మాత్రం ఉండదు..? మీరే చెప్పండి.. పెంపుడు కుక్కలకు స్నానం చేయించి ముద్దుగా అలంకరించడం, వాటికి..

Viral Video: ఎవరి అభిరుచి వారిదిలే.. బురద స్నానం చేస్తూ సుఖపడుతున్న కుక్క.. వైరల్ వీడియో మీ కోసం..
Dog Taking Mud Bath
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 03, 2023 | 7:55 PM

పెంపుడు కుక్కలు కూడా కొన్ని రకాల కష్టాలతో బాధపడుతుంటాయి. పెంపుడు కుక్కలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నవారు దానికి  సమయానికి ఆహారం పెట్టినా దాని స్వేచ్చను హరిస్తారు కదా.. సరదాగా అలా ఇంటి బయటకు నడుచుకుంటూ వెళ్లి తోటి కుక్కలతో ఊరంతా తిరిగి రావాలని ఏ కుక్కకు మాత్రం ఉండదు..? మీరే చెప్పండి.. పెంపుడు కుక్కలకు స్నానం చేయించి ముద్దుగా అలంకరించడం, వాటికి నచ్చాయని మనం అనుకునే ఆహార పదార్థాలను పెట్టడం తప్ప, వాటికి ఏం ఇష్టమనేది ఎప్పుడైనా ఆలోచించామా..? మనలో ఎవరూ అలా ఆలోచించి ఉండరు. అందుకే ‘బెల్టు తీసేసిన వెంటనే స్వర్గాన్ని అనుభవించడానికి దూకేస్తాం!’ అని పెంపుడు కుక్కలన్నీ పరుగులు పెడుతుంటాయి.

అయితే అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు నెట్టింట బాగా హల్‌చల్ చేస్తున్న కుక్క వీడియోను చూసినవారెవరైనా ఇది నిజంగా కుక్కేనా.. లేక కుక్క పిల్ల రూపంలో ఉన్న పంది పిల్లా..? అని అనుకోకుండా ఉండలేరు. ‘ViralHog’ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బురదలో పడి స్నానం చేస్తున్న ఒక కుక్కను మనం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

అందులో దానికి ఏం సంతోషం లభించిందో ఏమో కానీ శరీరం నిండా బురదను పులుముకుని మరీ స్నానం చేస్తోంది వీడియోలోని కుక్క. ఇప్పటికే నెటిజన్ల ఆదరణ పొందుతున్న ఈ వీడియోను అనేక మంది లైక్ చేశారు. అలాగే నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..