AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: అద్దిరిపోయే బహుమతితో వధువు ముఖాన్ని కాంతులతో నింపిన వరుడు.. అసలు ఆ గిఫ్ట్ ఏమిటంటే..

పెళ్లి సందర్భంగా వధూవరులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడమనేది సర్వసాధారణ విషయం. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలపు అమ్మాయిలు పెళ్లి రోజున తమ వరుడి కోసం డ్యాన్స్ వేస్తూ అలరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో.. అయితే..

Trending Video: అద్దిరిపోయే బహుమతితో వధువు ముఖాన్ని కాంతులతో నింపిన వరుడు.. అసలు ఆ గిఫ్ట్ ఏమిటంటే..
Groom Live Painting For His Bride
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 03, 2023 | 7:12 PM

Share

పెళ్లి సందర్భంగా వధూవరులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడమనేది సర్వసాధారణ విషయం. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలపు అమ్మాయిలు పెళ్లి రోజున తమ వరుడి కోసం డ్యాన్స్ వేస్తూ అలరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడాన్ని కూడా మీరు గమనించే ఉంటారు. ఇలాగే వధువు తన వరుడికి రుచికరమైన వంటకాలను తినిపించడం, లేదా వరుడు తన వధువుకు ఉంగరం, బంగారం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయించడం వంటికి కూడా మనం చూసే ఉంటాం. అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆ వీడియోలోని వరుడు తన వధువుకు ఉన్న చోటనే అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. వరుడు ఇచ్చిన బహుమతిని చూసి వధువు ముఖం వెలిగిపోయిందంటే కూడా తక్కువే. అంతగా ఆమె ముఖంలో కాంతులు విరబూసాయి.

‘వరుడి కోసం వధువు డ్యాన్స్ వేయడం మామూలే. ఇది చూడండి అందుకు భిన్నంగా ఉంటుంది. నా వధువు కోసం ప్రేమ’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వైరల్ వీడియోలో.. వరుణ్ జర్సానియా అనే పెయింటింగ్ ఆర్టిస్ట్ తన వివాహం సందర్భంగా లైవ్ పెయింటింగ్(కాన్వాస్‌పై) వేయడాన్ని మనం చూడవచ్చు. తన వరుడు ఎవరి చిత్రం వేస్తున్నాడో అర్థం కానీ వధువు అలా  చూస్తుండిపోయింది. అలా ఆమె కూర్చుని చూస్తుండగానే వరుడు తన భార్య చిత్రాన్ని తల క్రిందులుగా వేసి ఆమెను అబ్బురపరిచాడు. చిత్రం పూర్తయిన తర్వాత చూసిన వధువు అది తనదే అని తెలియడంతో ఎంతగానో సంతోషించింది. పెళ్లి రోజు తన వరుడు ఇచ్చిన బహుమతికి ఫ్లాట్ అయిపోయిన వధువు ముఖం వేయి కాంతులతో వెలిగిపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో మనం ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, దీనికి సంబంధించిన వీడియోను వరుడు తన  varun.jarsania అనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేశాడు. వీడియోను చూసిన నెటిజన్లు కూడా వధువు కోసం వరుడు ఇచ్చిన బహుమతి అమూల్యమైనదంటూ వరుణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పోస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 7వేల లైకులు అందుకున్న ఈ వీడియోకు నెటిిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..