Kidney Care: కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాలనుకుంటున్నారా..? అయితే ఈ 6 సూపర్ ఫుడ్స్ మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే..

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఉంటాయి. శరీర సమతాస్థితిని కాపాడడంతో పాటు, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు ఇవి పనిచేస్తాయి. అంతేకాక శరీరంలోని అదనపు ద్రవాలను తొలగించడంలో కూడా

Kidney Care: కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాలనుకుంటున్నారా..? అయితే ఈ 6 సూపర్ ఫుడ్స్ మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే..
Kidneys
Follow us

|

Updated on: Jan 03, 2023 | 5:00 PM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఉంటాయి. మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం వీటిపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. ఇవి శరీర సమతాస్థితిని కాపాడడంతో పాటు, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు ఇవి పనిచేస్తాయి. అంతేకాక శరీరంలోని అదనపు ద్రవాలను తొలగించడంలో కూడా కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరోలా చెప్పుకోవాలంటే శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేయడంలో కిడ్నీ పనిచేస్తుంది. అలా చేయడం ద్వారా కిడ్నీలు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. అయితే కిడ్నీలలో ఏదైనా సమస్య తలెత్తితే మన ఆరోగ్యం ఎంతగానో క్షిణీస్తుంది. శరీరంలో మలినాలను ఫిల్డర్ చేసే మరో అవయవం లేకపోవడంతో అనేక వ్యర్థాలు మన దేహంలోనే ఉండిపోతాయి. అలా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడడం ప్రారంభిస్తాయి. అయితే కిడ్నీలను కాపాడుకోవడంలోనైనా, వాటి పనితీరును మందగించేలా చేయడంలోనైనా మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధాన కారణం.

కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యలు చివరి రోజుల్లో తెలుస్తాయి. ఆ సమయానికి కిడ్నీలు పాడైపోతాయి. అటువంటి పరిస్థితి ఎదురవకుండా ఉండాలంటే కిడ్నీని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరి కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవాలనుకునేవారు తమ ఆహారంలో ఈ 6 సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వెల్లుల్లి: భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే వెల్లుల్లి అనేక రకాల వంటకాల రుచిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక వెల్లుల్లిలో పుష్కలంగా ఉండే మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.
  2. ఉల్లిపాయ: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. ఆ మాటలకు తగ్గట్లుగానే ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కూడా ఉల్లి పని చేస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆపిల్:  పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల ఆపిల్‌ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాక శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడంలో కూడా ఆపిల్ ఉపకరిస్తుంది. ఈ క్రమంలోనే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఆపిల్ పనిచేస్తుంది.
  5. క్యాలీఫ్లవర్:  క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫోలేట్,ఫైబర్ వంటివి క్యాలీఫ్లవర్‌లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
  6. ముల్లంగి: కిడ్నీ ఆరోగ్యానికి ముల్లంగిని తీసుకోవడం చాలా మంచిది. ఇందులో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి, సి కూడా పుష్కలంగా లభిస్తాయి.
  7. అనాస పండు: పైనాపిల్ చాలా రుచికరమైనదే కాక ఆరోగ్యకరమైన పండు. పైనాపిల్‌లో ఫైబర్, మాంగనీస్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.