Kadaknath Chicken: ఈ కోడి మాంసం ఒక కేజీ ఏకంగా రూ.1200లు.. అయినా తగ్గని డిమాండ్! ఎందుకో తెలుసా..
సాధారణంగా కేజీ చికెన్ ధర ఎంత ఉంటుంది కనిష్టంగా రూ.150.. గరిష్టంగా రూ.250 వరకు ఉంటుంది. ఐతే ఈ కోడి మాంసం మాత్రం చాలా ఖరీదు. అయితే..
సాధారణంగా కేజీ చికెన్ ధర ఎంత ఉంటుంది కనిష్టంగా రూ.150.. గరిష్టంగా రూ.250 వరకు ఉంటుంది. ఐతే ఈ కోడి మాంసం మాత్రం చాలా ఖరీదు. కేజీ చికెన్ ఏకంగా 1200ల రూపాయలు ఉంటుందట. ఈ కోడి స్పెషాలిటీ ఏమిటో..? అంత ధర పలకడం వెనుక ఉన్న కథాకమామీషు మీకోసం..
కడక్‌నాథ్ కోళ్ల గురించే మనం చర్చిస్తోంది. వీటి పెంపకం సాధారణ కోళ్ల పెంపకం కంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటే సాధారణంగా కోళ్ల ఫారంలలో పెంచే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లో దాదాపు రెండున్నర కేజీల బరువు పెరుగుతాయి. ఐతే కడక్‌నాథ్ కోళ్లు మాత్రం 6 నెలల కాలానికి ఒకటిన్నర కేజీ బరువు పెరుగుతుంది. అంతేకాకుండా వీటికి వేసే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. దీంతో వాటిని పెంచేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. లేయర్ కోళ్లతో పోల్చితే కడక్‌నాథ్ కోళ్లు గుడ్లు కూడా చాలా తక్కువ పెడతాయి. వాటిల్లో చాలా తక్కువ గుడ్లు మాత్రమే పిల్లలవుతాయి.
అందువల్ల ఒక్కో గుడ్డు ధర రూ.30ల వరకు ఉంటుంది. ఒక్కో కోడి పిల్ల ధర కూడా రూ.70లకు పైనే ఉంటుంది. కడక్‌నాథ్ కోళ్లను మాంసం కోసమే ఎక్కువగా పెంచుతారు. ఎందుకంటే సాధారణ కోళ్లతో పోలిస్తే ఈ కోళ్ల మాంసంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతను ఉన్నాయి కనుకనే కడక్‌నాథ్ కోళ్ల మాంసం కేజీ ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.