AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinnamon: రుచికీ, వాసనకే కాదు.. చర్మ సంరక్షణలో కూడా దీని పనితనం అమోఘం.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ప్రధానమైనదే. ఇది ఆహారానికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇక చర్మ సంరక్షణ విషయానికి వస్తే దాల్చిన చెక్క...

Cinnamon: రుచికీ, వాసనకే కాదు.. చర్మ సంరక్షణలో కూడా దీని పనితనం అమోఘం.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
Cinnamon Skincare Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 03, 2023 | 2:55 PM

Share

మన భారతీయ వంట గదిలో రుచికి ప్రధాన కారణం సుగంధ ద్రవ్యాలే. వీటినే వాడుక భాషలో మసాల దినుసులు అని కూడా అంటుంటాం. ఈ మసాలా దినుసులు కేవలం వంటకాల రుచి కోసమే కాక మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మన పూర్వీకులు ఈ సుగంధ ద్రవ్యాలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుండేవారు. నేటికీ ఆయుర్వేదంలో ఈ సుగంధ ద్రవ్యాలదే పైచేయి. ఇక ఈ సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ప్రధానమైనదే. ఇది ఆహారానికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇక చర్మ సంరక్షణ విషయానికి వస్తే దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేద గ్రంథాలలో ఈ మసాల దినుసుల  గురించి, సౌందర్య రక్షణ కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఇందులో పసుపు కూడా ఉంది.

అయితే చర్మంపై దాల్చిన చెక్కను ఉపయోగించడం గురించి చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. చర్మంపై దాల్చినచెక్కను పూయడం వల్ల చికాకుగా ఉండడమే కాక స్కిన్ ఎర్రగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. మీకు కూడా అలాంటి అపోహలే ఉంటే ఈ సమాచారం మీ కోసమే అని గమనించండి.

దాల్చిన చెక్క శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది చర్మ వ్యాధుల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. దాల్చిన చెక్క మొటిమల సమస్యలను నివారించడమే కాక వాటి మచ్చలను కూడా తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మంపై దాల్చిన చెక్కను ఉపయోగించే మార్గాలు:

  1. ముఖంపై మొటిమలను, వాటి మచ్చలను వదిలించుకోవడానికి దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడికి ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా కాకుండా దాల్చినచెక్కతో సమాన పరిమాణంలో పసుపు, పెరుగును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల మచ్చల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  2. చర్మం వృద్ధాప్యాన్ని, ముడతలను నివారించడానికి కూడా దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు. ఇందుకోసం అలోవెరా జెల్‌తో దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని చర్మంపై అప్లై చేసి తేలికపాటిగా మసాజ్ చేయండి. తర్వాత తడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతుంది.
  3. ముఖంపై స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దాల్చిన చెక్క పొడిలో పుల్లని పెరుగును మిక్స్ చేసి అప్లై చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మపు మచ్చలను తొలగిస్తుంది.
  4. గుడ్డులోని తెల్లసొనను దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి చర్మానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ మీకు మెరిసే, టోన్డ్ స్కిన్ ఇస్తుంది.
  5. శీతాకాలంలో పెదవుల సంరక్షణ కోసం కూడా దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు. పెట్రోలియం జెల్లీని చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి పెదాలపై అప్లై చేయాలి. తర్వాత తేలికపాటి చేతులతో స్క్రబ్ చేయాలి. ఆపై ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.