Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: కిడ్నీల ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే వీటిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే

కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఎన్నో రకాల అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు అసలు తెలియదు. తెలుసుకునే సమయానికే కిడ్నీలు పాడైపోయి ఉంటాయి.

Kidney Health: కిడ్నీల ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే వీటిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే
Healthy Kidney
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2023 | 1:48 PM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది శరీరంలో అనేక రకాల పనులను చేస్తుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలు, అలాగే అదనపు ద్రవాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేస్తుంనదన్నమాట. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఎన్నో రకాల అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు అసలు తెలియదు. తెలుసుకునే సమయానికే కిడ్నీలు పాడైపోయి ఉంటాయి. ఫలితంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే కిడ్నీని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోవాలో తెలుసుకుందాం రండి.

మిరియాలు

రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి

వెల్లుల్లిని భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహకరిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.

ఉల్లిపాయ

వంటలకు అదనపు రుచిని అందించడానికి ఉల్లిపాయ పనిచేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా ఉల్లిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.

ఆపిల్

పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు, జింక్ వంటి పోషకాలు ఆపిల్‌లో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫోలేట్, ఫైబర్ తదితర పోషకాలు శరీరం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతాయి. తద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

ముల్లంగి

కిడ్నీ ఆరోగ్యానికి ముల్లంగిని తీసుకోవడం చాలా మంచిది. ఇందులో పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి, సి కూడా సమృద్ధిగా లభిస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.