Eye Care Tips: కళ్ల మసకతో బాధపడుతున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే శరీరంలోని అన్ని ఇంద్రియాలలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని అర్థం. కాబట్టి కంటి సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు..
‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే శరీరంలోని అన్ని ఇంద్రియాలలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని అర్థం. కాబట్టి కంటి సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కళ్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల మనకు కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కంటి సమస్యలు అంటే కళ్లలో నొప్పి, తలనొప్పి, చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం వంటివి తలెత్తుతుతాయి.
ఈ క్రమంలోనే కంటి మసక వంటి సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఈ సమస్యను చాలామంది విస్మరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో కొన్ని హోమ్ రెమిడిస్ ద్వారా కంటి చూపును ఆరోగ్యంగా ఉంచవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నానబెట్టిన బాదంపప్పు తినండి నానబెట్టిన బాదంపప్పు తినడం కంటి చూపుకు చాలా మంచిది. దీని కోసం మీరు ప్రతి రోజు రాత్రి 7 నుంచి 8 బాదంపప్పులను నానబెట్టవచ్చు. మరుసటి రోజు ఉదయం వాటితో బాదం పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను నీటిలో కలుపుకొని తినవచ్చు. ఇది కళ్ళ సమస్యను తొలగిస్తుంది. బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది.
- ఎండుద్రాక్ష, అత్తి పండ్లను తినండి బలహీనమైన కంటి చూపుతో బాధపడుతున్నవాళ్లు నానబెట్టిన ఎండుద్రాక్ష, అత్తి పండ్లను తీసుకోవచ్చు. ఇందుకోసం రాత్రి 2 అత్తి పండ్లను 10 నుంచి 15 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.
- కళ్ళకు వ్యాయామం కల్పించండి కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కళ్ళ వ్యాయామం తప్పనిసరి. ఇది ఒత్తిడికి కూడా ఉపశమనంలా పనిచేస్తుంది. దీని కోసం మీ రెండు చేతులను కలిపి రుద్ది వాటిని కళ్ళ మీద ఉంచండి. కొద్దిసేపటి తరువాత చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇది కాకుండా మీరు ఐబాల్ ను ఎడమ నుంచి కుడికి, పైకి క్రిందికి తిప్పవచ్చు.
- బాదం, సోంపు, చక్కెర మిశ్రమం కంటి చూపుకు ఈ హోం రెమెడీ చాలా మేలు చేస్తుంది. దీని కోసం మీకు బాదం, సోపు గింజలు, చక్కెర అవసరం. వీటిని మెత్తగా పొడిలా చేసి రాత్రి పడుకునేముందు ఒక చెంచా పొడిని పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా వారం రోజులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
- దేశి నెయ్యి ఆయుర్వేదంలో దేశి నెయ్యి చాలా ముఖ్యమైనది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి కళ్ళ కాంతిని మెరుగుపరుస్తాయి. ఇందుకోసం మీరు కళ్ళకు నెయ్యి పూయాలి. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి.
- గూస్బెర్రీ రోజూ ఉదయం ఒక టీస్పూన్ ఆమ్లా రసం తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్ళ సమస్యను తగ్గించడంలో ఆమ్లా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.