Joint Pain Tips: శీతాకాలంలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే నొప్పులు మటుమాయం

నిపుణులు మాత్రం శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉండడం వల్లే కీళ్ల నొప్పులు అధికంగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. మనం తినే ఆహారాల వల్లే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Joint Pain Tips: శీతాకాలంలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే నొప్పులు మటుమాయం
Pains
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2023 | 5:36 PM

శీతాకాలంలో అందరూ బాధపడే సమస్య కీళ్ల నొప్పులు.. ఈ నొప్పుల వల్ల మనం చురుగ్గా ఉండలేం. అలాగే శరీర రక్షణ కోసం వ్యాయామాలు చేయడం కూడా స్కిప్ చేసేస్తుంటాం. అంతలా నొప్పులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే నిపుణులు మాత్రం శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉండడం వల్లే కీళ్ల నొప్పులు అధికంగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. మనం తినే ఆహారాల వల్లే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోకపోతే మరిన్ని ఇబ్బందులు పడతామని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లినా..శరీరంలో వేగంగా అభివృద్ధి అయ్యే యూరిక్ యాసిడ్ మరింత నష్టం చేస్తుందని నిపుణుల వాదన. 

శీతాకాలంలో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శీతాకాలంలో వాతావరణ దృష్ట్యా చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవడంతో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రమవుతుందని పేర్కొంటున్నారు. చలి కాలంలో వేధించే అజీర్తి సమస్యలు, ఎక్కువ పని చేయకుండా సోమరితనంగా ఉన్నా యూరిక్ యాసిడ్ సమస్యలు వేధిస్తాయి.  అలాగే శీతాకాలంలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుని ఫ్యాట్ ఆహారాన్ని తీసుకోకపోవడం, అలాగే భారీ విందులు, నిద్ర లేమి వంటి సమస్యల కారణంగా యూరిక్ యాసిడ్ శరీరంలో అధికమవుతుంది. శీతాకాలంలో మామూలుగా నీరు తక్కువ తాగుతారు. ఇదే సమస్యకు మూలకారణమని నిపుణుల వాదన. అలాగే వృద్ధులు పని ఎక్కువ చేయరు..అలాగే అధికంగా మాంసం తినడం వల్ల వారిలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

యూరిక్ యాసిడ్ సమస్య నుంచి రక్షణకు మార్గాలు

  • ప్రతి రోజూ కచ్చితంగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
  • అలాగే రోజూ తగినంత నీరు తాగాలి.
  • రాత్రి భోజనంలో కాయధాన్యాలు, బీన్స్, గోధుమలు వంటివి తీసుకోకూడదు. 
  • రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయాలి. అలాగే ఆ సమయంలో తేలికపాటి ఆహారాన్ని తినాలి.
  • ఉసిరి, బెర్రీ, నారింజ వంటి పుల్లని పండ్లు తినాలి.
  • అజీర్తి సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి.
  • అలాగే ఒత్తిడి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • రాత్రి సమయంలో పడుకునే గురక పెట్టి ప్రశాంత నిద్రను అనుభవించాలి. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే