Winter Health: చలికాలంలో ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..

Tips For Avoid Body Pains: చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని సమస్యలు తీసుకొని వస్తుంది. సాధారణంగా వింటర్‌లో జలుబు, దగ్గు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అయితే...

Winter Health: చలికాలంలో ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 15, 2021 | 5:38 AM

Tips For Avoid Body Pains: చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని సమస్యలు తీసుకొని వస్తుంది. సాధారణంగా వింటర్‌లో జలుబు, దగ్గు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అయితే కొందరు చలికాలంలో ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. ఉదయం లేవగానే కండరాలు పట్టేయడం, శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పులు వస్తుంటాయి. మరి ప్రతీసారి పెయిన్‌ కిల్లర్‌లు వేసుకోవడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ ఒళ్లు నొప్పులకు గుడ్‌బై చెప్పొచ్చు. ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం..

* ఒళ్లు నొప్పులు దరిచేరకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌తో కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టవచ్చనేది వైద్యుల సలహ.

* చలికాలంలో దెబ్బలు తగిలితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. నొప్పి అంత సులువుగా తగ్గదు… అయితే ఇలాంటి నొప్పికి అల్లంతో చెక్‌ పెట్టొచ్చు. అల్లాన్ని మొత్తగా గ్రైండ్‌ చేసిన ఒక వస్త్రంలో చుట్టి వేడి నీళ్లలో ఒక నిమిషం ఉంచి నీటిని పిండేసి వాపు లేదా గాయం ఉన్న చోట పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* తగినంత మంచి నీరు తాగకపోవడం కూడా కీళ్ల నొప్పులకు ఓ కారణమని చెబుతుంటారు. సహజంగానే వింటర్‌లో నీటిని ఎక్కువగా తీసుకోం. దీంతో నొప్పులు ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి చలికాలంలోనూ క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి.

* వింటర్‌లో వచ్చే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసుకొని స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి.

* దాల్చిన చెక్క పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి. రోజూ రాత్రిపూట గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Also Read: Elaichi For Good Health: ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారా ? మీ ఇంట్లో ఉండే యాలకులు ఎంతో బెస్ట్..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI