CM Jagan Tour: నేడు నర్సరావు పేటకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. కనుమ పండుగ పురస్కరించుకొని తలపెట్టిన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత జగన్ నర్సరావుపేట చేరుకోనున్నారు...

CM Jagan Guntur Tour: * ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత జగన్ నర్సరావుపేట చేరుకోనున్నారు. * కనుమ పండు పురస్కరించుకుని టీటీడీ, ఇస్కాన్ సంస్థలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తోన్న గోపూజ కార్యక్రమానికి ముఖ్యంత్రి హాజరవుతారు. * ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నర్సరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో గోపూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. * సీఎం పర్యటకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ సమీక్షించారు. * నరసరావు పేటలో జరగనున్న కామధేను పూజ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. * ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు హోం శాఖ మంత్రి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.