శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వస్త్రాలు సమర్పించిన చెంచులు..

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గురువారం పార్వతీపరమేశ్వరుల..

  • Shiva Prajapati
  • Publish Date - 10:07 pm, Thu, 14 January 21
srisailam brahmotsavam

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గురువారం పార్వతీపరమేశ్వరుల కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణానికి ఐటీడీఏ రవీంద్రారెడ్డి, చెంచె గిరిజనులు వస్త్రాలు సమర్పించారు. వెదరు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవీతం స్వామి వారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయ బద్దంగా వీరికి అర్చకులు, ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

కాాగా, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు చెంచు గూడెంల నుంచి చెంచు భక్తులు స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని తలకించేందుకు శ్రీశైల క్షేత్రానికి తరలి వచ్చారు. వీరితో పాటు స్థానిక మేకలబండలోని చెంచులు కూడా వచ్చారు. అయితే, చెంచెలు శ్రీశైల భ్రమరాంబ దేవిని తమ కూతురుగా, మల్లిఖార్జున స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. అలా ఆ దేవతామూర్తులను చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని అప్యాయంగా చెంచులు పిలుచుకుంటారు. అలా పార్వతి దేవిని తమ అడ పడుచుగా భావిస్తున్న చెంచులు.. ప్రతి ఏటా బ్రహోత్సవ కళ్యాణానికి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ఆనవాయితీగా వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు.

Also read:

TRS Party: మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి.. సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య లొల్లి..

Group Conflict: మచిలీపట్నంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. కత్తులు, రాళ్లతో దాడులు.. పలువురికి గాయాలు