వేసవిలో వడగండ్ల వానలు.. మండే ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతాయో తెలుసా?
సమ్మర్ వచ్చిందంటే చాలు భానుడి భగ భగలు, బయటకు వెళ్దామంటే మండే ఎండ, ఇంట్లో ఉక్కపోతతో సతమతం అవుతుంటారు. దీంతో చాలా మంది త్వరగా వర్షాకాలం వస్తే బాగుండు అనుకుంటారు. అయితే మనం గమనిస్తే వేసవి కాలంలో చాలా సార్లు భారీ వర్షాలు పడుతుంటాయి. మరి అసలే మండే ఎండాకాలం కదా మరి ఈ సీజన్ లో వర్షాలు పడటం ఏంటీ అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అసలు ఎండాకాలంలో ఎందుకు వానలు పడతాయి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, అసలు వేసవిలో వడగండ్ల వానలు ఎందుకు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Apr 10, 2025 | 9:11 PM

వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది చల్లటి ప్రదేశాలకు వేకేషన్స్ కు వెళ్తుంటారు. ఎందుకంటే బయటేమో ఎండ తీవ్రతో ఇంట్లో ఉందామంటే ఉక్కపోతతో చాలా బోర్ గా అనిపించడంతో చాలా మంది సమ్మర్ లో టూర్స్ ప్లాన్ చేస్తుంటారు.

అయితే చాలా వరకు సమ్మర్ లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ముఖ్యంగా వడగండ్ల వానలు, ఉరుపులు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతుంటాయి.

దీంతో కొంద మంది అసలు ఇది ఎండాకాలమా? లేక వర్షాకాలమా? అసలు వర్షాకాలమే వచ్చిందా అనే విధంగా వానలు పడుతుంటాయి. అయితే ఇలా సమ్మర్ లో వర్షాలు పడటానికి ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మండే వేసవిలో కూడా వర్షాలు పడటానికి ముఖ్య కారణం దక్కన్ పీఠభూమి కావడం. ఈ ప్రాంతం దక్కన్ పీఠ భూమి కావడంతో, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఆవర్త ద్రోణులు ఏర్పడుతాయంట.

అంతే కాకంఉడా మఠ్వాడ ప్రాంతం దగ్గరలో ఉండటం వలన క్యుమలోనింబస్ మేఘాలు ఏర్పడి వాటి ప్రభావంతో ఎండాకాలంలో కూడా అధిక వర్షాపాతం నమోదు అవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని వల్లే వేసవిలో వర్షాలు పడతాయంట. ( నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది.)