Premature Aging: ఈ అలవాట్లున్న అమ్మాయిలకు 20ల్లోనే వృద్ధాప్యం ముంచుకోస్తుంది.. ఎందుకో తెలుసా?
ప్రతిఒక్కరూ ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు 20 ఏళ్ల పడుచు వారిలా కనిపించడానికి రకరకాల తంటాలు పడుతుంటారు. అంతుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించి వివిధ వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అన్ని వ్యాయామాలు చేసినప్పటికీ, కొంతమంది మహిళలు తమ అసలు వయస్సు కంటే పెద్దవారిగా..
Updated on: Apr 10, 2025 | 9:09 PM

ప్రతిఒక్కరూ ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు 20 ఏళ్ల పడుచు వారిలా కనిపించడానికి రకరకాల తంటాలు పడుతుంటారు. అంతుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించి వివిధ వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అన్ని వ్యాయామాలు చేసినప్పటికీ, కొంతమంది మహిళలు తమ అసలు వయస్సు కంటే పెద్దవారిగా కనిపిస్తుంటారు. అవును, కొంతమంది మహిళలు 25 ఏళ్ల వయసులోనూ 40 ఏళ్ల వారిలా కనిపిస్తారు. చిన్న వయసులో వృద్ధురాలిలా, ఆంటీ ఎందుకు కనిపిస్తున్నారో తెలియక తెగ ఆందోళన పడుతుంటారు. నిజానికి, ఇలాంటి అమ్మాయిలు వారి రోజువారీ అలవాట్ల కారణంగా ఇలా అకాల వృద్ధాప్యానికి కారణమవుతారని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే నిపుణులు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఈ విషయంలో కాస్త ఉదాసీనత ఉండి వ్యాయామానికి దూరంటా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమ వయసుకంటే కాస్త ముందుగానే వృద్ధులుగా కనిపిస్తారు.

అలాగే అతిగా ఆందోళన చెందడం మంచిది కాదు. అది ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ విషయం తెలిసినా కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే చింతిస్తూ రోజులు గడుపుతుంటారు. ఎక్కువగా ఆందోళన చెందే అమ్మాయిలు తమ వయస్సు కంటే పెద్దవారిగా కనిపిస్తారు.

మితిమీరిన కోపం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ఈ కోపం మానసిక సమస్యలు, ఒత్తిడి, నిరాశకు కారణమవుతుంది. ఇది అకాలంగా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంతమందికి నీళ్లు తాగడం అంటే అలెర్జీ. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా ఉంటారు. నీరు తాగకపోవడమనే ఈ అలవాటు అమ్మాయిల్లో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ కొంతమంది అమ్మాయిలు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా మేల్కొంటారు. వీరికి తగినంత నిద్ర ఉండదు. ఈ నిద్ర లేకపోవడం ఒత్తిడికి గురిచేసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.




