Group Conflict: మచిలీపట్నంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. కత్తులు, రాళ్లతో దాడులు.. పలువురికి గాయాలు
Group Conflict: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. కాసానిగూడెంలో రెండు గ్రూపుల వారు కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు దిగారు....
Group Conflict: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. కాసానిగూడెంలో రెండు గ్రూపుల వారు కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురికి కత్తిపోట్లు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇరువర్గాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.
Laptops Theft: గర్ల్‌ఫ్రెండ్‌కు అవమానం జరిగిందనే కోపంతో 500 ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన యువకుడు