AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teachers Transfer: ఏపీలో 76 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ.. 17 నుంచి ఆన్‌లైన్‌లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు

Teachers Transfer: ఏపీ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈనెల 17 వరకు...

Teachers Transfer: ఏపీలో 76 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ.. 17 నుంచి ఆన్‌లైన్‌లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు
Subhash Goud
|

Updated on: Jan 14, 2021 | 8:47 PM

Share

Teachers Transfer: ఏపీ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు అధికారులు. బుధవారం 1,400 మంది ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులు వెబ్‌సైట్‌ నుంచి జారీ చేశారు. అయితే రాష్ట్రంలో మొత్తం 76 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, నోటిఫికేషన్‌ విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే మొదలైనా కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఆటంకం ఏర్పడింది.

వెబ్‌కౌన్సిలింగ్‌ ద్వారా ఈ బదిలీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకే స్కూలులో ఎనిమిదేళ్లు పని చేస్తున్న ఉపాధ్యాయులను, ఐదేళ్లుగా చేస్తున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేయడానికి రెండేళ్ల కనిష్ట సర్వీసు పెట్టారు. ఇలా అన్ని కలిపి మొత్తం 76 వేల మంది ఈ బదిలీ ప్రక్రియలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ ప్రతిపాదనల ఆధారంగా వారికి కేటాయించే పాయింట్లను బట్టి ఈ బదిలీ చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, వితంతు ఉపాధ్యాయినులు, ఇలా కొన్ని కేటగిరీల టీచర్లకు ప్రాధాన్యతనిచ్చారు.

వారికి వచ్చిన పాయింట్ల ఆధారంగా వారు ప్రాధాన్యక్రమంలో ఇచ్చిన పాఠశాలల వెబ్‌ ఆప్షన్లను అనుసరించి బదిలీ చేస్తున్నారు. కాగా, బదిలీ ఉత్తర్వులు డౌన్‌లోడ్‌ చేసుకుని తాము పని చేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్‌ అయి తమకు కేటాయించిన కొత్త పాఠశాలలో జాయిన్‌ కావాలని విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. కాగా, సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 18 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

Central Parliamentary: 16న చిత్తూరు జిల్లాకు కేంద్ర పార్లమెంటరీ బృందం.. అభివృద్ధి పనుల పరిశీలన