AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taravani Annam: మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తరవాణి అన్నం లేదా చద్దు అన్నంగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో టిఫిన్స్ బదులుగా ఈ తరవాణి అన్నం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోనాలున్నాయి. దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ బి12 అధికంగా ఉండే అత్యంత పోషకమైన ఆహారం. ఈ రోజు తరవాణి అన్నం తయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..

Taravani Annam: మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం
Taravani Annam
Surya Kala
|

Updated on: Apr 10, 2025 | 9:31 PM

Share

ప్రస్తుతం ఎక్కువ మంది ప్రోబయోటిక్స్ గురించి చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. అయితే ఈ ప్రోబయోటిక్స్ తో పాటు విటమిన్ బి12ని అందించే పోషకాహారం తరవాణీ అన్నం. దీనిని తినడం వలన బి12 సప్లిమెంట్లు అవసరం ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ దీనిని ఉదయమే అల్పాహారంగా తినవచ్చు. అమ్మమ్మల వంటకం తరవాణీ అన్నం తయారీ విధానం ఈ రోజు తెలుసుకుందాం.. ‘

తరవానీ అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు:

  1. రాత్రి మిగిలిన అన్నం
  2. మజ్జిగ
  3. పాలు
  4. కరివేపాకు
  5. ఉప్పు
  6. పచ్చి మిర్చి

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేసి కొంచెం పాలు, మజ్జిగ, ఉప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి కలిపి ఒక ప్లేట్ తో కప్పండి. ఇది మర్నాడు పులిసి.. చిన్న బుడగలు కనిపిస్తాయి. ఇది తరవాణీ అన్నం తినడానికి రేడీ. ఇది మామిడికాయ ఊరగాయతో తినవచ్చు. లేదా తాలింపు వేసుకుని కూడా తినవచ్చు.

తాలింపు ఎలా వేసుకోవాలంటే

ఒక చిన్న గిన్నె పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. దీనిని తరవానీ అన్నంలో వేసుకుని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొండి. ఇందులో ఊరగాయ, ఉల్లిపాయ, వంటి వాటిని నంజుకుని తినొచ్చు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే

  1. పులియబెట్టిన అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది.
  2. పులియబెట్టిన ఆహారాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.
  3. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  4. శరీరానికి చల్లదనాన్నిస్తుంది.
  5. వీటిలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
  6. వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుంది.
  7. భోజనం ఆలస్యం అయినా కడుపు నిండిన భావనతో, శక్తివంతంగా ఉంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..