AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులసు పేరుతో అప్పట్లో హల్ చల్ చేశాడు కమెడియన్ ఆర్పీ. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాడు. ఇంట్రస్ట్ ఉన్నవారికి ఫ్రాంఛైజీలు కూడా ఇచ్చాడు. కానీ ఎందుకో ఈ దుకాణం ఒక్కసారిగా క్లోజ్ చేశాడు..?

Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..
Kirrak RP Fish Business
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2026 | 10:06 PM

Share

ఆర్టిస్ట్‌గా కొనసాగుతూ ఉండగానే.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. నెల్లూరు స్టైల్ వేరే ఉంటుంది అని.. తాను చేపలతో పాటు పులుసులో వేసే అన్ని మసాలా దినుసులు.. నెల్లూరు నుంచే తెప్పినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పులసు పెట్టే వర్కర్స్‌ను సైతం నెల్లూరు నుంచే రప్పించినట్లు అప్పట్లో వివరించాడు. దీంతో ఈ ఫుడ్ లవర్స్ అప్పట్లో ఈ పులసు రుచి చూసేందుకు క్యూ కట్టారు. అయితే ఈ పులుసుపై మిక్స్‌డ్‌ రివ్యూస్ వచ్చాయి. కర్రీ అంత టేస్ట్ లేదని.. రేటు ఎక్కువగా ఉందని కొందరు కామెంట్స్ చేశారు. అయితే ఆర్పీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా వరుస బ్రాంచులు ఓపెన్ చేసి హడావిడి చేశాడు. అంతేకాదు డబ్బులు తీసుకుని పలు ప్రాంఛైజీలు కూడా ఇచ్చాడు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఆయన ఉన్నఫలంగా ఈ బిజినెస్‌కు క్లోజింగ్ బోర్డు పెట్టేశాడు. ఆపై రాజకీయాల్లో బిజీ అయ్యాడు. టీడీపీ తరుఫున ప్రచారం చేయడంలో కీ రోల్ పోషించాడు. అంత మంచిగా ఉన్న బిజినెస్ ఎందుకు క్లోజ్ చేశాడో తాజాగా క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ.

జీవితంలో ప్రయాణించే క్రమంలో.. ఆ ఫుడ్ బిజినెస్ ఒక పార్ట్ అని.. అలానే పాలిటిక్స్ కూడా ఒక భాగమని వివరించాడు. రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల చేపల పులసు బిజినెస్ నుంచి తప్పుకున్నట్లు వివరించాడు. ఇక తన రాజకీయ భవిష్యత్‌పై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పదవి ఇస్తారనే ప్రచారం ఉందని.. ఏదైనా బాధ్యత ఇస్తే తీసుకునేందుకు తాను రెడీ అని చెప్పాడు. తన స్థాయి, అర్హత బట్టి ఏదైనా పదవి ఇస్తే.. బాధ్యతతో అవినీతి రహితంగా పని చేస్తానని వివరించాడు. టీడీపీ తరుపున నిజాయతీగా పనిచేస్తానని వివరించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి. 

కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..