AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంట పొలాల్లో నక్కి నక్కి తిరుగుతున్న చిరుత.. భయంతో వణికిపోతున్న జనం!

పులులు బాబోయ్.. పులులు.. జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు, పెద్దపులులతో పల్లెవాసులు హడలిపోతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చిరుతల సంచారాలు కలకలం రేపుతున్నాయి. అడవుల నుంచి పొలాల్లోకి వచ్చి భయపెట్టడమే కాదు.. ఇప్పుడు ఏకంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తూ వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా చిరుతపులి దెబ్బకు ఆ గ్రామం వణుకుతుంది..

పంట పొలాల్లో నక్కి నక్కి తిరుగుతున్న చిరుత.. భయంతో వణికిపోతున్న జనం!
Leopard Scare In Kadapa District
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 10:04 PM

Share

పులులు బాబోయ్.. పులులు.. జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు, పెద్దపులులతో పల్లెవాసులు హడలిపోతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చిరుతల సంచారాలు కలకలం రేపుతున్నాయి. అడవుల నుంచి పొలాల్లోకి వచ్చి భయపెట్టడమే కాదు.. ఇప్పుడు ఏకంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తూ వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా చిరుతపులి దెబ్బకు ఆ గ్రామం వణుకుతుంది.. ఎప్పుడు దాడి చేస్తుందో.. ఎవరిపై పడి ప్రాణాలు తీస్తుందో.. అని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ఆ గ్రామం ప్రజలు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కడప జిల్లా సిద్దవటం మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది.. సిద్దవటం మండలం మూలపల్లిలో చిరుత సంచరించడం స్థానికులు గమనించారు. మూలపల్లి ఎస్సీ కాలనీ సమీపంలో చిరుతను చూసిన స్థానికులు కేకలు వేయడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అటవీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ సమీప గ్రామం కావడం వల్లే జనావాసాల మధ్యకు వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇటీవల మూలపల్లి సమీపంలో చిరుతలు అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అటవీ సమీపంలో ఉన్న గృహాల వద్ద నక్కినక్కీ చిరుతలు తిరుగుతున్నాయని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం చిరుత సమాచారం ఉంటే తమకు తెలపాలని, భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. సిద్ధవటం ప్రాంతంలో ఉన్న లంకమల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఉంది. దీనిని టైగర్ జోన్ గా కూడా చెబుతారు ఈ క్రమంలో స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో పాటు రాత్రులు అలాగే తెల్లవారుజాము ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..