ASSAM Rifles Jobs 2026: రాత పరీక్ష లేకుండానే.. అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. పదో తరగతి అర్హత
Assam Rifles Recruitment Rally 2026: అస్సాం రైఫిల్స్.. స్పోర్ట్స్ కోటా కింద రైఫిల్‌మ్యాన్, రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు భర్తీ..

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన అస్సాం రైఫిల్స్.. స్పోర్ట్స్ కోటా కింద రైఫిల్‌మ్యాన్, రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 95 రైఫిల్‌మెన్/ రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ- స్పోర్ట్స్ కోటా) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్‌ధులు రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ ర్యాలీ ఫిబ్రవరి 2026 నుంచి మే 2026 వరకు నిర్వహిస్తారు. అర్హల గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫుడ్‌బాల్, షూటింగ్, పెన్‌కాక్ సిలాట్, క్రాస్ కరటే, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్‌తక్రా, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్, జూడో, త్వైకాండో, పోలో, వుషూ.. వంటి తదితర క్రీడల్లో అంతర్జాతీయ లేదా జాతీయ లేదా రాష్ట్రస్థాయి లేదా ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొని ఉండాలి. అలాగే అభ్యర్ధుల వద్ద సంబంధిత చెల్లుబాటు అయ్యే క్రీడా సర్టిఫికెట్లు కూడా తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 18 నుంచి 33 ఏళ్ల మద్య వయసు ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 10, 2026వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




